ఈ మధ్యన ఇంటెర్నెట్ లో ఎక్కడ చూసినా ఈ బ్లాగుల సందడే. దాంతో నాక్కూడా చాలా ఊత్సాహం వచ్చేసింది. ఆంధ్రుడ్ని కదా. ఆరంభశూరత్వం ఉంటుంది కదా. మొదలు పెట్టా కాని ఏమి రాయాలో ఎంత రాయాలో ఏమి తెలియట్లే. కాని ఏదొ రాయాలి అని తపన. ఎందరో తెలుగు 'భావు 'లు అందరికీ వందనాలు(భావు అంటే మరాఠీ లొ సొదరుడు అని). అనేక మంది తెలుగు వారి బ్లాగుల్లోని విషయ సంపత్తి, వారి రచనా సామర్ధ్యం, శైలి చూసి చాలానే నిరుత్సాహ పడ్డా. కాని ఇంత తెలుగు బ్లాగ్సంపద చూసాక, ఇంతమంది అండగా ఉండగా నాకెందుకు భయం అని పెనుధైర్యం ఆ వెనుకనే. మీ అందర్నీ చూసుకొని దిగుతున్నాను. మీ సలహాలు, సహకరాలు నాకిమ్మని మీ అందరికి నా విన్నపం.
సత్యసాయి కొవ్వలి
బ్లాగు లోకానికి స్వాగతం, సత్యసాయి గారూ!
ReplyDeleteసుస్వాగతం సత్య సాయి గారు. తెలుగు బ్లాగు గుంపులో కూడా చేరండి.
ReplyDeleteచక్కగా వ్రాసారు, స్వాగతం సత్య సాయి గారు.
ReplyDeleteపెద్ద్దలందరికీ, మీప్రోత్సాహక వచనాలకు నా కృతజ్ఞతలు. సుధాకర్‍గారి సలహానుసారం గుంపులో జేరాను. ఈవేళే హల్లుల్లో ప్రవేశించా (మరో బ్లాగ్ వేసా)
ReplyDeleteనాలాంటి వాళ్లను చూస్తే మళ్లీ నేనామాత్రం రాయలేనన్న ఉత్సాహం తప్పకుండా వస్తుంది. తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం
ReplyDeleteతెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. మీనుంచి చాలా ఆశిస్తున్నాం. అందరికీ పంచండి.
ReplyDelete