Friday, January 09, 2009

ముంబై ముచ్చట్లు (ఇక్కట్లు) - హమ్మయ్య ... టెర్రరిస్టులు సమ్మె విరమించారు

నవంబరులో (26/11) టెర్రరిస్టుల దాడికి బలయిన వాళ్ళు అతికొద్ది మంది. కానీ స్పందించినవాళ్ళు మొత్తం దేశప్రజలందరూ. ఇప్పుడు 3 రోజుల నుండి దేశం మొత్తం ఆయిల్ కంపెనీ సిబ్బంది సమ్మె ధాటికి అతలాకుతలం అయిపోతే బ్లాగ్లోకం లో కానీఇతరత్రా కానీ కనీస స్పందన లేదు. బహుశః టెర్రరిజం అంటే తుపాకులూ, బాంబులూ అని మనకున్న అవగాహన వల్ల అయుండచ్చు. నా దృష్ఠిలో బాంబులూ తుపాకుల వల్ల కొద్దిమంది, కొన్ని ప్రాంతాల్లో బాధ పడతారు. కానీ ఈ ఆయిల్ సిబ్బంది సమ్మె వల్ల ఈవేళ ఎంత మంది కష్టపడ్డారో ఎవరికీ అంత తెలియదు. అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే రక్తాలూ, గాయాలూ, ఓవర్ టు తాజ్ బ్లడీ కవరేజ్ లూ ఉండవు కదా. ఆటోలు లేవు, టాక్సీలు లేవు, కాంట్రాక్టు బస్సులు లేవు. చివరికి పబ్లిక్ రవాణా ఎన్ని రోజులు నడవగలదో తెలియదు. పెట్రోలు లేక పోతే పోనీ, సెలవు పెట్టుకుని ఇంట్లో కూచోవచ్చనుకుంటే (రోజు కూలీలకి ఆసౌకర్యం కూడా లేదు) , కొన్ని ప్రాంతాల్లో కనీసం వంటగ్యాసు (పైప్ డ్) రాలేదుట. 3 రోజులు ఇలాంటి పరిస్తితి ఉంటే ఎంత ఆర్ధిక నష్టం, అసౌకర్యం కలిగుంటుందో మీ అవగాహనకి అందని విషయం కాదు. టెర్రరిష్టుల అటాకే బెటరు, అదృష్టం బాగుంటే తప్పించుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమ్మెలలో ఆఛాన్సే లేదు.
ఈవిషయం చర్చిస్తుంటే ఒకాయన వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ మాటఎవరూ వినరు కాబట్టి సమ్మె ఓకే. ఏసీ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళం ఇంతకన్నా దూరాలోచన చేయలేమేమో!

3 comments:

  1. ఇవ్వాళ మధ్యాహ్నం ప్రాంతం లో నాకు కనిపించిన దృశ్యం. ఒక పెట్రోలు పంపు దగ్గర యాంకరమ్మ(బహుశా కన్నడ టి.వి అనుకుంటా) మైకు పట్టుకు మాట్లాడుతోంది. పెట్రోలు పంపు లో బారులు తీరిన జనం. ఇదంతా వీడియో తీస్తున్న మనిషి ఇంకోతను. కొద్ది రోజులు ఇబ్బంది పడితే తర్వాత ఖర్చుల మోత తో షరా మాములుగా గడిచిపోయే దానికి ఆవేశ పడడం ఎందుకు.

    ReplyDelete
  2. ఆయిల్ అధికారుల సమ్మె పూర్వాపరాలు మీకు తెలిసినట్లు లేదు. 24 Hours work liability తో పనిచేసే ప్రభుత్వరంగ సంస్థల అధికారులను ముంబాయి టెర్రరిస్టులతో పోల్చడం మీ అహంకారమో, అవగాహనా రాహిత్యమో తెలియడంలేదు.

    ReplyDelete
  3. @చంద్రమోహన్ గారు
    రెండూః)) నిజంగా పూర్వపరాలు నా కు తెలియవు. వాళ్ళ బాధలు కూడా నాకు తెలియవు. నేను స్పందించినది కేవలం దేశజనాభాలో 1 శాతం కూడా ఉండని ఉద్యోగుల సమ్మె వల్ల దేశం మొత్తానికి కలిగిన పక్షవాతానికి - అదీ ప్రస్తుతం మనం ఉన్న సంక్షోభ పరిస్తితుల్లో.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.