Tuesday, March 16, 2010

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

ఈసంవత్సరం మీ అందరికీ శుభప్రదం కావాలని మనసారా సాయినాధుని ప్రార్ధిస్తున్నాను.

క్రితం సంవత్సరం వైయెస్ దుర్మరణం, తెలుగువాళ్ళమధ్య అకారణ అంతఃకలహాలు, అశాంతి, వరదలు, క్షామం, మండిన ధరలు,  ఒకటేమిటి మొత్తం సంవత్సరమంతా ఇలాగే గడిచింది. అన్నిటికన్నా ముఖ్యంగా బాధకలిగించినవిషయం తెలుగువాళ్ళ మధ్య సృష్టించబడ్డ విభేదాలు, వాటికి విద్యాధికులు కూడా లొంగిపోయిన వైనం. నాసహోద్యోగులు కొందరి వాదనలు వింటే ఎంతనేర్చినా కూడా విద్యావంతులు కూడా  భావావేశాలకి బానిసలని అర్ధమయింది.  నా దృష్టిలో విడిపోవడం సమస్యకాదు కానీ తెలుగువాళ్ళు ఒకళ్ళమీద ఒకళ్ళు బురదజల్లుకోవడం, ఓఇంట్లో గొడవపడుతుంటే  పక్కిళ్ళవాళ్ళు వినోదం పొందినట్లు మిగిలినరాష్ట్రాలవాళ్ళు, చిదంబర,మొయిలీయాదులు వినోదించడం, అన్నిటికన్నా ప్రజలమనసులు విరిచేయడం విషాదకరం.

ఈసంవత్సరం దీనికి భిన్నంగా, తన పేరు సార్ధకం చేసుకోకుండా అందరికీ ఆనందాల్ని పంచాలని మరోసారి కోరుకుంటూ

భవదీయుడు

సత్యసాయి కొవ్వలి

5 comments:

  1. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మీకు,మీ కుటుంబానికి వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

    ReplyDelete
  4. బాచి3/17/2010 12:24 am

    హాయ్,

    థాంక్స్. మీకు కూడా శుభాకాంక్షలు. మీరు తెలుగు లో టైపు చెయ్యడానికి ఏమి టూల్స్ వాడుతారు. నాకు ఈ మెస్సేజ్ టైపు చెయ్యడానికి ౧ గంట పట్టింది. నేను ఉబుంటు లినక్సు వాడుతున్నాను. దయచేసి చెప్పగలరు

    ReplyDelete
  5. అందరికీ కృతజ్ఞతలు.
    @బాచి గారు
    నేను ఇన్స్క్రిప్టు వాడుతున్నాను. అది మొదలెట్టాక, ఇంక వేరే ఏపద్ధతీ నచ్చట్లేదు.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.