Sunday, August 08, 2010

బహుకాల బ్లాగడం

ఈమధ్య బ్లాగులు చదువుతున్నా కానీ వ్రాయడం లేదు. కారణం పెద్దగా ఏం లేదు. బద్ధకం. అదీకాక అందరూ అన్నిటిమీదా తెగ బ్లాగేస్తూంటే ఏం రాయాలో తట్టట్లేదు. కుక్కపిల్లా, అగ్గి పుల్లా అని ఎన్నిసార్లు పునశ్చరణ చేసినా వ్రాతకి స్పూర్తి కలగట్లేదు. ఈలోపు మా స్నేహితుడికి మిత్రత్వదినం సందర్భంగా ఫోన్ చేస్తే ఎందుకు రాయడం లేదని అడిగాడు. తను రెండు మూడుసార్లు సత్యశోధనకి వెడితే కొత్త టపాలు లేవని, ఇలా గేపిస్తే ఇంక నా బ్లాగు ముఖం ఎవరూ చూడరని చెప్పాడు.  బ్లాగు రాస్తే స్నేహం కట్ అనే పరిస్తితుల్లో, రాయక పోతే బాధపడిన వాడే నిజమైన స్నేహితుడని సెంటిమెంటలయి పోయి మళ్ళీ రాద్దామని నిర్ణయించేసుకున్నా. అలా అని రోజూ రాసేయను అని హామీఇస్తున్నా.

భవదీయుడు

సత్యసాయి

7 comments:

  1. satyaanveshi garu,

    happy to see your profile. most of my people are in banks. my uncle retired as GM, RBI, Hyd. father retired from SBI. brother and cousins in various banks. i know KBS Sarma garu very well. he worked at Chennai before joining NABARD at Hyd.

    ReplyDelete
  2. dhanyavAdAlu. maralA chAlA rOjulaku tapa rAstunnaru. keep writing.

    ReplyDelete
  3. @రాజేంద్ర
    ఎక్కువ రాయనన్న హామీనా :)
    @మాధురి
    చాలా సంతోషం. శర్మ గారు నా కు బాగా పరిచయం. మీ తర్వాత కామెంటిన ప్రసాదు కూడా నాబార్డే

    ReplyDelete
  4. సత్యాన్వేషి అంటే సత్యసాయిగారా ? నమ్మశక్యంగా లేదే ! మఱి కొన్ని బ్లాగులలో ఈ పేరుతో వ్యాఖ్యలు వ్రాస్తున్నదెవఱు ?

    --తాడేపల్లి

    ReplyDelete
  5. నేను సత్యాన్వేషిని కాను తాడేపల్లి గారూ. మాధురిగారు అలా సంబోధించినా పెద్దగా పట్టించుకోలేదు, ఏదో పొరపాటని. ఏదో ఇంట్లో కూచుని శోధించడమే కానీ బయటికి వెళ్ళి అన్వేషించేంత సీను లేదు. :)

    ReplyDelete
  6. i had typed 'satyaanveshi garu' by mistake instead of 'satyasodhana garu'. i regret the mistake.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.