మొన్న రామనవమికి మా ఊళ్ళో (సోల్‍లో) మనవాళ్ళు ఒక సత్సంగం ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా విష్ణుసహస్రనామస్తోత్రం చదివాం. అంటే, సుబ్బులక్ష్మి గారితో కాస్తంత గొంతూ, పెదాలూ కలిపాం. ఆవిడతో గొంతుకలపడం కూడా అదృష్టమేనంటాను. ఎందుకంటే, ఆవిడ గొంతు వింటేకానీ ఆశ్రీనివాసుడు నిద్ర కూడా లేవడు. ఇతర కార్యక్రమాలు కూడా అయిపోయాక ముగ్గురు చెప్పిన మూడు ముక్కలుః
1.విష్ణుసహస్రనామస్తోత్రం (వేయి నామాలు) చదవడం వల్ల వచ్చే ఫలితం ఒక్క రామనామంతో వస్తుంది.
2.రామనామస్మరణకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పధకం ఉంది. దాని ప్రకారం రామభక్తులకి ఆంజనేయుడు కూడా వశమైఉంటాడు.
3.రాముడికీ తెలుగువాళ్ళకీ తరతరాల ప్రత్యేక అనుబంధం ఉందీ అనిపిస్తుంది. ఆయన పుట్టిందీ,పెరిగిందీ ఉత్తరాదిలోనైనా, ఆయనని కీర్తించి, స్తుతించి, ఆయన నామాన్నీ, ఖ్యాతినీ చిరస్థాయిగావించిన ముఖ్య కవులూ,గాయకులూ, వాగ్గేయకారులూ తెలుగు వారే. కృష్ణుడనగానే మనకి సూరదాసు, మీరాబాయ్ లాంటి తెలుగేతరులు గుర్తొస్తారు కానీ, రాముడనగానే రామదాసు, త్యాగయ్య, మైసూరు వాసుదేవాచార్యులు, మొల్ల, విశ్వనాథ లాంటి తెలుగు వాళ్ళే ఎక్కువ గుర్తుకు రావడం విశేషం. ఈమధ్యన ఎవరో అన్నట్లు, రాముడ్ని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, చివరకి ముప్పాళ్ళ రంగనాయకమ్మతో సహా.
ఆ సందర్భంలో గుర్తుకు తెచ్చుకొన్న కీ.శే.దేవులపల్లి వారి పాట ఈక్రింద ఇస్తున్నా. దీన్ని పాలగుమ్మి విశ్వనాథంగారు స్వరపరచారు. ఆవరుస ఎలా ఉంటుందో వినాలని ఉంటే ఈ లంకెని నొక్కండి.
ఎన్నిసారులు అన్ననూ...
పల్లవి
ఎన్నిసారులు అన్ననూ ఎన్నెన్ని తీరులు విన్ననూ
అన్నకొలదీ విన్నకొలదీ అమృతభరితము రామచరితము ..ఎన్ని..
చ1
కలముపట్టి కవివరేణ్యులు - గళమువిప్పి గాయకులు
నీమధురగానము కొలువగా - మైమరచి నిను ధ్యానించగా
వెలసెనెన్నో పాటలు -నిను చేరుటకు విరిబాటలు ..ఎన్ని..
చ2
బ్రతుకు బరువై సుఖము కరువై
అలసిసొలసిన వేళలా
ఏదారి లేని ఎడారిలో....ఏదారి లేని ఎడారిలో
ఆధారమైనది నీదు నామము ..ఎన్ని..
"ఒకటి కొంటే ఒకటి ఫ్రీ"
ReplyDelete"..., చివరకి ముప్పాళ్ళ రంగనాయకమ్మతో సహా."
అదిరాయండి, చెణుకులు!
ప్రస్తుత సినిమా మరియు శాస్త్రీయ సంగీతపు గాలివానలో లలిత గీతము కొట్టుకుపోతున్నది..
ReplyDeleteఆ దీపము ఆరకుండా ఉండడాని చేయవలసిన కార్యక్రమాలు ఎవరూ చేయటము లేదు.
ఇంత మధురమైన, లలితమైన గీతము అందించినందుకు నా అభినందనలు.
ఈ లలితగీతాలకి విడిగా వేరే భ్లాగు ఉంటె మంచిది..పెడతారు కదూ..
మీ రాత గురించి:
నాకు రెండు వాఖ్యాలు బాగా నచ్చాయి
1 - ఒకటి కొంటె ఒకటి ఫ్రీ
2 - రంగనాయకమ్మ తో సహా..
కృతజ్ఞతలు. 'రంగనాయకమ్మతో సహా' అన్నది నా వ్యాఖ్య కాదు ఎవరో ఓ పెద్దయన అన్నది. వేరే బ్లాగు అయిడియా బాగుంది.
ReplyDeleteఈ పాట చాలా బాగుంది మాష్టారు !
ReplyDeleteఆ మూడుముక్కల్లో మొదటిరెండూ చాలా లోపాయికారీగా ఉన్నాయి. పాటమాత్రం చాలా సరళంగా సుందరంగా రాశారు. ఇంటికెళ్లి వినాలి.
ReplyDeleteఅబ్బ! ఎంత మధురంగా పాడారు? సార్, ఆ గొంతు మీదేనా? "వెలసెనెన్నో పాటలు" - అన్నప్పుడు పాట మాధుర్యం అత్యున్నతంగా ఉంది.
ReplyDeleteకృతజ్ఞతలు రానారె. అవును నా గొంతే. మూలధ్వని (ఒరిజినల్ ట్రాక్) లేదు చాలా పాటలకి అందుకే ట్యూన్ ఐడియా ఇవ్వాలంటే గొంతు చేసుకోవాల్సొస్తోంది. అన్నట్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ReplyDeleteధన్యవాదాలు గురువుగారూ, మీ పాట మీలాగే పాడాలని విఫలప్రయత్నం చేస్తున్నాను. ఆ అసంపూర్ణ ప్రయత్నాన్ని త్వరలో బ్లాగుతా, వినడానికి మానసికంగా సిద్ధంకండి.
ReplyDeleteరాముడిని "నమ్మకా" చెడలేదు రంగనాయకమ్మ.
ReplyDeleteదీన్నిబట్టి అర్థమయ్యేదేమంటే నమ్మినా నమ్మకున్నా చెడేదీ లేదు.
మీ స్వరం/పాట బాగున్నాయి.
--ప్రసాద్
http://blog.charasala.com
అబ్బే, అలా కాదండీ. పగనైనా, వగనైనా రాముడిని తలిస్తే చెడిపోరని. మీప్రోత్సాహక స్పందనకి కృతజ్ఞతలు.
ReplyDeleteసత్య సాయి గారు మీ పాట ఇప్పుడే విన్నానండీ ఎంత మధురం గా పాడారు సార్... చాలా చాలా బాగుంది.
ReplyDeleteచాలా చాలా బాగుంది మీ పాట....
ReplyDelete