Friday, April 13, 2007

అంతా వేదాల్లో ఉందష...

ఈ వాక్యం చాలా వ్యంగ్యాత్మకం. వేదం అంటే ఒకటో రెండో పుస్తకాలనుకోవడం వల్లా, మన పెద్దలకు తెలిసిన విజ్ఞానం పనికిమాలినదన్న మిడిమిడి జ్ఞానపు (పాశ్చాత్య) ప్రచారం వల్లా, అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలు బ్రాహ్మల సృష్ఠి అన్న దురూహ, తద్వారా వచ్చిన వైముఖ్యత, వల్ల ఈ వాక్యానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. వేదమంటే సమాజంలో పోగుపడిన జ్ఞానం. మనకున్న జ్ఞానసంపద మనకు గర్వకారణం కాదగినది. ఈవాక్యం వ్యంగ్యంగా అన్నా ....


......నిజమే అంటోంది ఈ దృశ్యమాల.

A vast number of statements and materials presented in the ancient Vedic literatures can be shown to agree with modern scientific findings ... all » and they also reveal a highly developed scientific content in these literatures. The great cultural wealth of this knowledge is highly relevant in the modern world. Techniques used to show this agreement include: - Marine Archaeology of underwater sites (such as Dvaraka) - Satellite imagery of the Indus-Sarasvata River system - Carbon and Thermoluminiscence Dating of archaeological artifacts - Scientific Verification of Scriptural statements - Linguistic analysis of scripts found on archaeological artifacts - A Study of cultural continuity in all these categories.

2 comments:

  1. చక్కటి టపా, వీడియో .కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. సత్య సాయి గారు,

    ఇదే పేరుతో ప్రసాద్ గారు కూడా ఒక టపా రాసారు. భిన్నాభిప్రాయాలతో ఇద్దరూ ఒకే పేరుతో రాసారు. నేను మీరిచ్చిన వీడియో సగం మటుకే చూసాను. మొత్తం కూడా వీలు వెంబడి చూస్తాను. అప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటే మళ్ళీ వ్యాఖ్య రాస్తాను. మీరు నా టపా (ఈశ్వరుడు), దాని పై నా వ్యాఖ్య చదవగలరు.

    నా అభిప్రాయం ఇంతకీ ఏమిటంటే, ఇప్పటి విజ్ఞానం ఇప్పటితో ఆగిపోయేది కాదు. ఇప్పుడు తెలిసిందంతా కచ్చితంగా నిజమూ కాదు. వైజ్ఞానికులకూ భేదాభిప్రాయాలు ఉన్నాయి. వైజ్ఞానికులూ ఆస్తికులే చాలా మంది ఉన్నారు. ఎవల్యూషన్ సిద్ధాంతం కూడా కాస్తంత మారుతోందని చదివాను. అలాంటప్పుడు తొందరపడి ఇప్పటి సైన్సుకూ, మన వేదాలలో చెప్పిన వాటికీ ఎందుకు సామ్యాలు చూపించెయ్యడం? అప్పుడూ యంత్రాలు ఉండేవి అని చూపించే ప్రయత్నం కొంత మటుకు అదో తృప్తిని ఇస్తుందనటంలో సందేహం లేదు. అయితే ఇంతకీ, వేదాలలో ఉన్నది విజ్ఞానమా, లేక జ్ఞానమా?

    వేదాలలో మంచి మాటలు ఉండే ఉండాలి. "సర్వే జనాః సుఖినో భవంతు!" అన్నది వేదం లో చెప్పినదేనా? "సహనా వవతు... " ఈ శ్లోకం? నాకు సరిగా తెలియదు. తెలిసిన వారు చెప్ప గలరు ఇవి వేదాలలోనివేనా అని. ఇది రాస్తూ ఉంటే ఇప్పుడే నాకు అనిపించింది. పైన చెప్పిన శ్లోకంలో, మనిషి తాను ప్రకృతి తో సహజీవనం సామరస్యంగా చేస్తాను, అందు వల్ల శాంతి చేకూరగలదు అని చెప్పినట్లు తోచింది నాకు. బాగా తెలిసిన వారు సరైన అర్థం చెప్ప గలరు. "ఓం! శాంతిః శాంతిః శాంతిః!" అది చాలదూ, మంచి అని చెప్పుకోవడానికి.

    ఇలాంటివి వేదాలు అధ్యయనం చేసిన వారు గాని, వారితో పరిచయమున్న వారు గాని శోధించి సమకూరిస్తే ఎంత బాగుంటుంది.

    తర తరాలుగా మన సమాజంలో మతం పేరు చెప్పుకుని, దేవుడి పేరు చెప్పుకుని ఎన్నో అత్యాచారాలు జరిగాయి, జరుగుతున్నాయి. అందుకు మతం చెప్పిన మంచిని, దేవుడి పై నమ్మకం మంచిని పెంచడానికి ఎలా ఉపయోగపడుతుంది, వేదాలు, ఇతిహాసాలలో పాతివ్రత్యం, చాతుర్వర్ణ్యం కాకుండా ఇంకా ఇప్పటి రోజులకి ఉపయోగపడే మంచి మాటలు ఏమున్నాయి అని పరిశొధన చేసి రాసి ప్రచారం చెయ్యొచ్చు కదా.

    మన జాతీయ నినాదం "సత్యమేవ జయతే" ఎంత గొప్ప వాక్యమండీ. అది ఉపనిషత్తు నుండి తీసుకున్నదట కదా. అది ఒక బౌద్ధ మతం తీసుకున్న రాజు నుండి మనం స్ఫూర్తిగా తీసుకున్నాం. ఇవన్నీ ఎంత సహృదయతని చూపుతాయి. మన జాతి ధ్యేయాన్ని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు మనం. మొన్న ఒక రోజు నా పాసుపోర్టు చూస్తుంటే నా దృష్టి పడింది ఆ నినాదం మీద.

    ఇవి కాకుండా వేరే దేశస్థులు , వేరే మతస్థులు "వాటర్" లాంటి సినిమాలలో చూపించిన తరాల వెనుకటి సాంఘిక దురాచారాల గురించి మనని నిలదీస్తే మనం కంగారు పడడం, మన గొప్పతనం ఏంటో వెతుక్కునేలోపు మనం వారి వాదనలకి లోబడిపోవడం జరుగుతుంది. భారత దేశంలో పుట్టి పెరిగిన మా లాంటి వారి పరిస్థితే ఇలా ఉంటే, ఇక రేప్పొద్దున మా లాంటి వారి పిల్లల పరిస్థితి ఏంటి?

    కలిసి పూనుకుందా. సామాజిక దురాచారాలను దూరం చేసుకుందాం. మన సాంస్కృతిక, జ్ఞాన సంపదను కాదు.

    లలిత.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.