Tuesday, April 17, 2007

పొద్దులో బ్లాగులపై పేరడీ - నేడే చదవండి

ఈవేళ బ్లాగులు చూస్తోంటే, పొద్దులో బ్లాగులపైన పేరడీ కనబడింది. మొదలెట్టగానే చివరివరకూ చదివించింది. పేరడీ అంటే ఇలా ఉండాలి. చదువుతోంటే, ఆయా బ్లాగర్లే వ్రాసారా అన్న అనుమానం వచ్చింది. మంచి ప్రయోగం. మిగిలిన బ్లాగర్లకి కూడా తొందరగా చీమలు కుట్టేస్టే బాగుండును. కానీ పేరడీ ఎవరు వ్రాసారో వ్రాయలేదు.
ఈ అజ్ఞాత వాసులతో చాలా సమస్యగా ఉందండీ బాబోయ్. ఈవేళ కొన్ని బ్లాగులు చూస్తోంటే, అది వ్రాసిన వాళ్ళను తెలుసుకోవాలని కుతూహలం కలిగింది- చాలామంది అజ్ఞాతవాసులే. ఇక్కడికొస్తే పేరడీ కర్త అజ్ఞాత వ్యక్తి. ఈమధ్య బ్లాగులు చదువుతోంటే, పత్రికల్లో వార్తలు వ్రాసే విధానం గుర్తుకొచ్చింది. ఎవరింటిలోనో దొంగతనం జరుగుతుంది. ఆ వార్తని ఇలా వ్రాస్తారు.

"ఈవేళ తెల్లవారుజామున సుమారు మూడు గంటలకి నగర శివార్లలో ఒక యింట్లో గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఆయింటి యజమాని, తాము మంచినిద్రలో ఉండడంవల్ల దొంగలను చూడలేదని చెప్పారు. ఈసంఘటనపై స్పందిస్తూ, స్తానిక ఎస్.ఐ. (తమ పేరు బయట పెట్టద్దని కోరారు) వెంటనే దొంగలని పట్టుకోంటామని హామీ ఇచ్చారు. సంఘటన జరిగిన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు"

ఎంత విషయ సంపత్తి?

చావాకిరణ్ గారైతే ఇలా కూడా వ్రాసేవారేమో?

'అనుకున్నంతా అయిపోయింది. దద్దురే మిగిలింది. ఇక గోలపెట్టడమే మనం చేయగలిగింది'

ఆతర్వాత మనమంతా అడుగుతాం- వ్యాఖ్యలద్వారా- దీనిభావమేమి తిరుమలేశా అని. ఆనక ఆయన చిద్విలాసంగా మరి కాస్త వివరిస్తారు. :)

ఆయన స్టైలే వేరు. బ్లాగ్మూల పురుషుడు కదా!

7 comments:

  1. బాగా వ్రాసినారండి.

    ఇది ఒక కోణమే అని పొద్దులో అన్నదానికి మీరు మరో కోణము కూడా భళే పట్టేసినారు కదా :)

    నిజానికి ఇలా వ్రాయడము మొదలెట్టడానికి ఓ చిన్న ఫ్లాష్ బాక్ ఉన్నది.

    నా బ్లాగులో నేను జ్ఞాపకాలు దాచుకుందాము అని ఓ ఆశ. అలా గని అన్నీ వ్రాయలేను కదా, అందుకని నాకు మాత్రం తెలిసేట్టు ఏదో ఓ నాలుగు లైన్లు వ్రాసుకుంటాను తర్వాత నేనది చదివినప్పుడు నాకెలాగూ ఆ సంఘటన / కారణం గుర్తు వస్తుంది కదా!

    ReplyDelete
  2. నేను సింగరేణిలో పని చేసేటపుడు ఓ రోజు ఓ ఇంజనీరు ఇంటికెళ్తూ రెండో షిఫ్టు ఇంజనీరుకు ఓ పని అప్పజెబుతున్నాడు..

    "ఏదో మిషనులో ఏదో ప్రాబ్లెము ఉంది, క్వారీలో ఎక్కడో ఉంది. మిషను త్వరగా కావాలట, వెంటనే రిపేరు చేసి, ఆపరేషను వాళ్ళకు అప్పజెప్పండి"

    అది డోజరో డంపరో తెలీదు, ఎక్కడుందో తెలీదు, సమస్యేంటో తెలీదు, కానీ బాగు చేసి ఇవ్వాలి!! (కొద్దిగా అతిశయోక్తి వాడాను లెండి)

    ReplyDelete
  3. ఆర్టికల్ కి లింకు ఇస్తే బాగుండేది.

    ReplyDelete
  4. సత్యసాయి గారూ!మీరన్నట్లు ఈ మధ్య తెలుగుబ్లాగులోకంలో అజ్ఞాతవాసులెక్కువైనట్లే ఉంది. "బ్లాగులోకంలో ముసుగువీరులు" అని వాళ్ళ గురించి బ్లాగాలని కూడా అనిపిస్తోంది. :)

    ReplyDelete
  5. అజ్ఞాతంలో ఉండటం బ్లాగర్ల బ్లాగ్జన్మ హక్కు!

    మీరు దానిని కాదనకూడదని నే బ్లాగిస్టు అజ్ఞాత వీరుల సంఘం తరుపున మనవి చేస్తున్నా!

    ఆయ్ఁ

    నేను కూడా మొదట్లో అజ్~ఆతినే

    ReplyDelete
  6. @చదువరి - మీ ఇంజనీరు ఉదాహరణ భలే ఉంది. మా అమ్మ టీచరుగా పనిచేసిన హైస్కూల్లో ఒక సోషల్ టీచరుగారు యూనిట్ టెస్టులో "ఖాళీలు పూరింపుము" ప్రశ్న ఇలా ఉందిట.
    "---- యుద్ధము ---- కు ----- కు మధ్య జెరిగెను." :-)
    ఇంకా గొప్ప తమాషా ఏంటంటే ఆవిడ క్లాసు విద్యార్ధులు ఆ ఖాళీల్ని కరక్టుగా పూరించడం!

    ReplyDelete
  7. ఆచార్యవర్యా,
    అసలీ పేరడీలు మీ సృష్టేనేమోనని ఒకరి సందేహం. పొద్డులో వ్యాఖ్యలు చూడండి.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.