మన జనాలకి అభిమానాలు బాగానే ఉన్నాయి. అందులో భాషాభిమానం, దేశాభిమానం, మతాభిమానం ఈమధ్య బాగానే కనిపిస్తున్నాయి. ఇందులో మొదటి దానికి ఉదాహరణ ఈమధ్య జరిగిన సంఘటనలు.
మొన్న ముంబై మిర్రర్ లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపనీ CEO ఆనంద్ మహీంద్రా మీద ముంబై మునిసిపాలిటీ తరఫున ఓ గుమాస్తా క్రిమినల్ కేసు పెట్టారని చదివాం. కారణం ఆయన తన కంపెనీ బోర్డుమీద మరాఠీలో రాయకపోవడం. ఎప్పుడో 1948 లో చేసిన ఒక చట్టం ప్రకారం ఆయన నేరస్థుడయ్యాడు. ఆ చట్టం ప్రకారం 50 – 500 రూపాయలు జరిమానా వేయచ్చు. అదీకాక, ఆకంపనీలో ఈబోర్డులూ, గీర్డులూ బాధ్యత ఏ డైరెక్టరుదో నిర్ధారించుకుని వారినే బాధ్యులని చేయాలిట. వీళ్ళ వెర్రి కాని, భాషాభిమానం ముందు ఈఅడ్డంకులేమిటీ. ఆమధ్య నవనిర్మాణ సమితి కార్యకర్తలు గూండాగిరీ చేసి మరాఠీలో బోర్డులు లేని షాపులని ధ్వంసం చేసారు. అదీ ఉత్సాహం అంటే. భాషాభిమానం చూపించుకునే పధ్దతిదీ. అన్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు రాజ్ ధాకరేని మీరు మరాఠీ, మరాఠీ అంటూ మీ పిల్లలని ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని అడిగాడు. దానికి ఆయన నేను చెప్పేది నాన్-మరాఠీయుల కోసం, మరాఠీయులకి పర్వాలేదని వాక్రుచ్చారు.
మాయల మరాఠీ అన్న ప్రయోగం ఎప్పుడైనా విన్నారా?
ఈ పిచ్చి ఈ మధ్య అందరికీ బాగానే పాకింది. భాష మీద అభిమానం "తంతా"మంటే కలిగేది అని ఈ ప్రబుధ్ధుల అభిప్రాయమనుకుంటా.
ReplyDelete"నేను చెప్పేది నాన్-మరాఠీయుల కోసం, మరాఠీయులకి పర్వాలేద" ఇది మాత్రం సూపరో సూపరు.