Tuesday, December 08, 2009

త్యాగరాజు తెలంగాణా ద్రోహా?

ఆదివారం డిసెంబరు 6 న త్యాగరాజగానసభకి వెళ్ళాం. కిన్నెర ఆర్ట్స్ ధియేటర్ వాళ్ళు నిర్వహిస్తున్న నెలవారీ బాలల సాంస్కృతికోత్సవంలో మా అమ్మాయి చి.శ్రావ్యవరాళి (బ్లాగు: వరాళి వీచికలు) కర్నాటక సంగీత కచేరీ ఆరోజు 6 గంటలకి పెట్టిన సందర్భంగా అక్కడికి వెళ్ళాం.  ముందురోజు తెరాస కార్యకర్తలు త్యాగరాజ గాన సభ బోర్డుమీద తెలంగాణా వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు గానసభ అని, కళా సుబ్బారావు కళావేదిక (మినీ హాలు) బోర్డు మీద కాళోజీ కళావేదిక అని   ఎర్ర స్టిక్కర్లంటించారు. నిర్వాహకులు ఆరోజు, ఆతర్వాతి రోజు కార్యక్రమాలు రద్దు చేసారు. ముంబై నుండి వచ్చామని కనికరం తో మా అమ్మాయి కచేరీ జరిగింది. చాలామంది రావలసిన వాళ్ళు ఊర్లో పరిస్థితికి భయపడి రాలేదు.  చివరిదాకా ఉండిన అనిశ్చిత పరిస్థితివల్ల మేం కూడా ఎవరికీ ధైర్యంగా చెప్పనుకూడా లేదు. అయినా దేఁవుడి దయవల్ల హాలు సగం వరకూ నిండింది. కార్యక్రమం సవ్యంగా జరిగింది. ఆతాలూకు వార్తావిశేషం కింద చూడండి.   చి.శ్రావ్యకి మీ అందరి ఆశీస్సులు అందజేయమని ప్రార్ధిస్తున్నా. 

saakshi_cover

 

eenadu coverage

 

ఇదిలా ఉంచితే అసలు త్యాగరాజుకి తెలంగాణాకి సంబంధం ఏంటో నాకర్థంకాని విషయం.  ఆయనపేరుని ఈసభకి పెట్టడం కోస్తా ఆంధ్ర వాడని పెట్టారా? అలాగే కళాసుబ్బారావుకి త్యాగరాజగానసభకీ ఉన్న అనుబంధాన్ని పక్కకి తోసేసి కేవలం తెలంగాణా వాడని కాళోజీ పేరు పెట్టడంలో ఔచిత్యం ఏంటో?  పొట్టి శ్రీరాముల విగ్రహం, తెలుగు తల్లి విగ్రహం బద్దలు కొట్టడం తాలిబాను చేష్టలకి తీసిపోలేదు.  తెలంగాణాలో మాట్లాడేది తెలుగు కాదా?

10 comments:

  1. well said. According to them, even Tikkana who is one of trinities of mahabharata writers in telugu willnot be considererd telenganite as he did not write in Telengana Maandalikam

    ReplyDelete
  2. శ్రావ్యకి మా అభినందనలు మరియు ఆశీస్సులు. మంచి కార్యక్రమాన్ని చూడలేకపోయామన్నమాట.

    ReplyDelete
  3. శ్రావ్యకి అభినందనలు !

    ReplyDelete
  4. శ్రావ్యకి అభినందనలు.

    ReplyDelete
  5. శ్రావ్యవరాళి సంగీత కచ్చేరి తప్పి పోయామే. ఈ కార్యక్రమం ఉందని సమాచారం లేదు. తెలుగు + గానం అంటే తెలుగు పాట కాలక్రమేణా తెలంగాణమయ్యిందని ఎక్కడో చదివాను. చరిత్ర తెలియక తెలుగు తల్లిని అవమానిస్తున్నారు -విగ్రహ ధ్వంస కార్యక్రమాలు చేపడ్తున్నారు. 1969 ఉద్యమంలో విధ్యార్ధులు వారి జీవితంలో విలువైన ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. లాభపడింది రాజకీయవాదులు.

    ReplyDelete
  6. చిరంజీవికి అభినందనలు.

    ReplyDelete
  7. శ్రావ్యవరాళికి అభినందనలు. ఆమెకు మంచి అభిరుచిని కలిగించినందుకు మీకూ అభినందనలు.

    ReplyDelete
  8. శ్రావ్యకు అభినందనలు.దీవెనలు. ఆడియో ఉంటే పెట్టగలరా??

    ReplyDelete
  9. శ్రావ్యవరాళి గారికి అభినందనలు. ఆడియో ప్రచురిస్తే విని ఆనందిస్తాము.

    ReplyDelete
  10. అందరికీ వందనాలు.ఆడియో పెట్టాను తర్వాతి టపాలో లంకె ఇచ్చా.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.