Friday, December 15, 2006

తెలుగు జాకెట్టు గుడ్డ పథకం

పూతరేక్స్ లో వారుణి వాహిని కి కీ.శే. రామారావుకి సంబంధ ఏమిటని అడిగారు. మంచి సమాధానాలొచ్చాయి. అవి చదివిన తర్వాత ఇది రాయాలనిపించింది.

ఆపథకం పేరులో ముందు తెలుగు అని ఉంది. 'తెలుగు వారుణి వాహినీ పథకం'. రామారావు గారికి సంస్కృతసమాసాలూ, అచ్చతెలుగు పేర్లు చాలా ఇష్టమనుకొంటా. పౌరాణికసినిమాల అనుభవం మరి. అలాగే హంద్రీనీవా ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకానికి 'హంద్రీనీవా సజల జల స్రవంతి' అని అనుకొంటా పేరు పెట్టాడు. గ్రామాల్లో ఆడవారికి టాయిలెట్ల కోసమని ఒక పథకం పెట్టాడు. దాని పేరు కూడా స్వచ్చమైన తెలుగే. 'తెలుగు మహిళా మరుగు పథకం' అనో 'తెలుగు మహిళా బహిర్భూమి పథకం' అనో ఉండాలి. ఆరోజుల్లో ఢిల్లీలో ఉండేవాడిని. స్లీవె‍లెస్ల బాధ భరించలేక, అదే రామారావయితే ఏం పథకం పెట్టేవాడు అని అలోచించా. బహుశ: 'తెలుగుబిడ్డ- జానెడు జాకెట్టు గుడ్డ' పథకం పెట్టేవాడేమో! క్షమించాలి. జాకెట్టు ఆంగ్ల పదమని ఇప్పుడే ప్రసాద్‍గారు చెప్పారు. పథకం పేరు మర్చేస్తున్నా- 'తెలుగుబిడ్డ- జానెడు రవికె గుడ్డ.' ఇంకా తెలుగులో చెప్పాలంటే, 'తెలుగుబిడ్డ- జానెడు కంచుకం గుడ్డ పథకం.' జాకెట్టును కంచుకం అని కూడా అంటారని విన్నాను. నిజంగా పెట్టేవాడేమో? కాని ఈలోపునే లక్ష్మీపార్వతితో బిజీ అయిపోవడం వల్ల ఆడబిడ్డలకి టైమ్ కేటయించలేక పోయాడు, పాపం.

6 comments:

  1. జాకెటు కూడా ఆంగ్ల పదమండీ, రామారావు గారు ఉండుంటే అచ్చ తెలుగు పదం "రవిక" అని ఉపయోగించేవారు.

    మంచి Compilation. చాలా సేపు నవ్వుకున్నాను.

    ReplyDelete
  2. హంద్రీ నీవా పేరు "హంద్రీ నీవా సుజల స్రవంతి" అండీ. మీ రవికె పథకం ఆలోచన భలే ఉంది. :D నవీన్ గారు సూచించినట్లు తెలుగు వికీపీడియాలో మీరూ ఓ చెయ్యి వేయగలరని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  3. పొదుపైన దుస్తుల్లోని ఒక బక్కపలచని మోడల్ ఫోటోని చూసి లొట్టలేస్తూ "హయ్‌హ్‌యో, తినడానికి తిండిలేక కట్టడానికి బట్టలేక..." అని బాధపడతాడో హాస్యనటుడు. బహుశా ఈ సినిమా వెంకటేశ్, సౌందర్యలది. మీ టపాచూసి గుర్తొచ్చింది. పకపకా.

    ReplyDelete
  4. aa peddaayana maatelaa vunna miiru pettina peru mataram adirindandi

    ReplyDelete
  5. మన తెలుగు అకాడెమి వాళ్ళని 'రవికల గుడ్డ' ని ఇంగ్లిషులోకి అనువదీంచమంటే ఏంచేస్తారో - బహుఃసా - Sun Dream Cloth అంటారేమో!!

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.