Monday, January 22, 2007

బాబా, కేసీఆర్, తెలంగాణా

నిన్న రాత్రి వార్తల్లో కేసీఆర్ బాబాగారి వ్యాఖ్యలని ఖండిస్తూ బాబాకి రాజకీయాలెందుకని ప్రశ్నించడం విని కాస్తంత ఆశ్చర్యపోయాను. ఆయన ఏఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేసినా బాబాలాంటి సమాజానికి పనికొచ్చే పనులు చేసేవాళ్ళకి రాజకీయాల్లో స్థానం లేదని చెప్పకనే చెప్పారు. కాని ప్రజాస్వామ్య భారతదేశంలో పుట్టిన వాళ్ళెవరైనా, వాళ్ళు బాబాలైనా, లుచ్చాలైనా వారి అభిప్రాయం చెప్పే హక్కుందనుకొంటాను. బాబా చేసిన వ్యాఖ్య ఈనాడులో చూసాను. నాకేమి పెడార్ధాలు కనిపించలేదు. కేసీఆర్ కి ఇంత ఉలుకెందుకో? raise your voice if your argument is weak అనే వాక్యాన్ని చాలా వాదాలు నిరూపిస్తున్నాయి.


బాబా మీద ఎవరికైనా ఎలాంటి అభిప్రాయం ఉన్నా, ఆయన అనేకమంది నుండి సేకరించిన సంపద సమాజసేవకి ఉపయోగపడుతోందనడంలో సందేహంలేదు. అనేక జిల్లాల్లో (కొన్ని తెలంగాణా జిల్లాల్లో కూడా) ఆయన ప్రవేశపెట్టిన తాగునీటి పథకం ఆయనపట్ల ఉన్న గురి వల్ల నిర్వాహకులు అతి త్వరగా, నాణ్యంగా పూర్తిచేయడం చూస్తే 'కట్' ల కోసమే పనిచేసే యంత్రాంగం సిగ్గుపడాలి. ప్రభుత్వాలు తమ బాధ్యతలను నిర్వహించడం కోసం తమ వనరులు ఉపయోగించకుండా (తి.తి.దే. తొ సహా) ఒక వ్యక్తిని డబ్బులడుక్కోవడం సిగ్గు చేటు. ఈరకమైన చిత్తశుద్ధి రాహిత్యాన్ని రాజకీయాలనడం జనాలు చేసుకొన్న పాపం.

5 comments:

  1. మీమాటే నా మాట!
    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  2. మీరన్నది నిజమే.నేను ఈ వార్త విన్నప్పటి నుండి అదే అనుకుంటున్నాను.వీల్లందరూ ఎందుకు ఇంత గా రిఏక్ట్ అవుతున్నారా అని.కానీ పత్రికల్లోను,మన బ్లాగుల్లోను కూడా అందరూ ఒకేలా ప్రతిస్పందించడంతో నేను కొద్దిగా ఆలోచనలో పడ్డాను.నేనొక్కదాన్నే ఇలా ఆలోచిస్తున్ననా అని.సాయిబాబా ను నేను పూజించను గాని ఆయన చెసే చాలా మంచి పనులవల్ల ఒక మంచి వ్యక్తి గా అభిమానిస్తాను.సమైక్యం గా వుండండి అనడంలో తప్పేముందో నాకు అర్దం కావట్లేదు.ఈ రాజకీయ నాయకులందరూ తమ స్వార్దం తో రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారు.ఎక్కడ లేవు రైతుల ఆత్మ హత్యలు.అంధ్ర లో కూడా వున్నాయి.చాలా వరకు వెలుగుచూడట్లేదు అంతే.ఫ్లోరైడు సమస్య గురించి మాట్లాడుతున్నారు.ఆంధ్రా లో గోదావరి పక్కన వుండే ఊర్లలో కూడా త్రాగు నీరు దొరకదు .చెరువులోని మురికి,మట్టి నీటిని అలాగే తాగుతారు.ఇది ఎవరికయినా తెలుసా?అలా అని ప్రతి జిల్లాని విడగొట్టి రాష్ట్రం చేసేస్తాం అంటే ఎలా?[నేను రాసిన ఈ మాటలు ఎవరినైనా బాధ పెట్టి వుంటే క్షమించగలరు.ఇది నా అభిప్రాయం మాత్రమే.]

    ReplyDelete
  3. నా మట్టుకు నాకు ఈ బాబాలమీద ఎలాంటి అభిప్రాయం లేదు కానీ, ఇలా వారిని సమాజంలో పౌరులుగా గుర్తించలేని తుచ్చ రాజకీయనాయకులను చూస్తే నవ్వు వస్తుంది. వీళ్ళు ఎప్పటికి రాజ్యాంగం, పౌర హక్కులు అనే వాటిని అర్ధం చేసుకుంటారో కదా? చదువుకునేటప్పుడు స్లిప్పులు పెట్టి సోషల్ స్టడీస్ పాస్ అయితే ఇలానే మాట్లాడుతారు మరి. బాబా అయితే రాజకీయాలకు అతీతుడా? అలా అయితే మహా భారతంలో సగం మహా మునులు రాజ గురువులుగా పనికిరారు. బాబాలు రాజకీయాలకు అతీతులయితే వారిని దండించే హక్కు, నిలదీసే హక్కు ఈ సమాజానికి ఉండదు. రేప్పొద్దున ఒక టీచర్ ఇలా అంటే, టీచర్ వి నీకెందుకు రాజకీయాలు? పిల్లకాయలకి పాఠాలు చెప్పుకో పో అంటాడేమో కుళ్ళు సి.ఆర్. రాజకీయం ఏమైనా ఉద్యోగమా? ఎవరి పని వారే చేసుకోవటానికి?

    ReplyDelete
  4. ఎండిపోయిన ఎముకను పట్టుకొని ప్రేమగా కొరుకుతూ కాలక్షేపంచేసే కుక్క దగ్గరికి మనిషెవడైనాపోతే అది గుర్రుగా అభద్రతాభావంతో చూసి భౌమంటుంది. కళ్లుమూసుకొని ఆ దృశ్యం ఊహించుకోండి. బాబామీద కేసీయోరి మండిపాటు అలాంటిదే. ఇక్కడ అసలు సంగతిని వదిలేసి తెలంగాణాను ఎముకతో పోలుస్తున్నారని రాజకీయంచేస్తే ఎలావుంటుందనే ఆలోచన చేస్తారేమో ఇది చదివితే.

    "రాజకీయం ఉద్యోగమా" అని మీరన్నమాటతో ఈ మధ్య నేను ఈనాడులో చదివిన మరొక రాజకీయుని వ్యాఖ్య గుర్తొస్తోంది - "రాజకీయ నిరుద్యోగులే టిఆర్‌ఎస్‌లో ఆశ్రయం పొందుతున్నారు" అని. ఈ మాటతో ఆయన తానొక ఉద్యోగినన్నట్లేకాదూ‍!

    ReplyDelete
  5. రామనాథమూ... అక్కడే తప్పులో కాలేశావు. తెలంగాణాను ఎండిపోయిన ఎముకతో పోల్చావనికాదు కేసీఆర్ ను కుక్కతో పోల్చావని మొరుగుతారు. ఎట్టాగు ఈ దేశంలో లేవు కాబట్టి తప్పిచ్చుకొన్నావు, లేదంటే బొడ్డు చొట్టూ 24 సూదులేపిచ్చుకొనేటోడివి :)

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.