Friday, June 15, 2007

యాహూ మెసెంజర్లో తెలుగు ఆడిబుల్స్

యాహూ మెసెంజరులో చాటింగు చేసే వాళ్ళకి ఆడిబుల్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇవి కొన్నైతే చాలా సరదాగా ఉంటాయి. ఈమధ్య కొన్ని భారతీయ భాషల్లో కూడా వచ్చాయి. కానీ తెలుగులో ఇంకా రాలేదు. మన పొరుగు వాడు తమిళ్ వాళ్ళవి కూడా వచ్చాయి. ఎవరైనా నడుం బిగించి దీనికి పూనుకొంటే బాగుంటుంది. పూనుకోమని భావము.

నేను ప్రతిపాదిస్తున్న కొన్ని మెస్సేజ్ లు -


ఏమండీ కుశలమా?
ఏం మాస్టారూ బాగున్నారా?
ప్రియతమా పరాకా? నేనంటే చిరాకా?
ఛీ .. పోదురూ?
నీకంత సీనులేదులే
నే తొడ కొడితే నువ్వు ఆన్లైన్లోకొచ్చేస్తావు, జాగ్రత్త (బాలకృష్ణ తరహాలో)
అర్ధం చేసుకోరూ
ఎంద చేట
అమ్మతోడు. నేను నిజంగా ఆఫ్ లైన్లో ఉన్నా
తమ్ముడూ .. తమ్ముడూ ..ఈ తికమక దిగులే ప్రేమంటే
మౌనమేలనోయీ....
మనసు నిలుపుకోలేక ఎదో ఎదో అడిగాను... అంతే ... అంతే.. అంతే... కుశలమా...
వల్లభా.... ప్రియ వల్లభా...
వద్దు బావా తప్పు
ఏదో శాస్త్రం చెప్పినట్లుంది
తాంబూలాలిచ్చేసా తన్నుకు చావు
ఓ ... డేమిట్ .. కథ అడ్డం తిరిగింది...
పాలు గారు బుగ్గల పైనా... పాపాయికిఒకటి.. తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి...
అంతేనా ... మనసింతేనా...
ఏంటి చెప్పేది... కేబేజీ ...
తొక్కలో మెస్సేజి ఇంత సేపు టైపుచేయాలా?
మావా.. నే మునుపటి వలెనే లేనా?
గుండె గొంతులోన కొట్టడుతాది.. కూర్చుండనీదే కూసింత సేపు..
అలా అయితే ఓకే !
ఏంటీ గొంతులేస్తాంది?
సుత్తి ఆపవయ్యా,మహాప్రభో
ఏందిరా మావా నీ సుత్తి
రాసాను ప్రేమలేఖలెన్నో

నాకైతే ఇప్పటికివి చాలు ...

10 comments:

 1. ఓహో, యాహూలో ఈ సౌకర్యం కూడా ఉందా!! బాగున్నాయి. నేనోటిస్తా.. "ఏంటి కబుర్లు?"

  ReplyDelete
 2. అబే జల్ది లిఖ్ రే!

  ReplyDelete
 3. భలె వున్నాయండి.నేను ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను వీటికోసం.చాలా ఎక్కువగా వాడుతుంటాను నేను.వాటితో పాటూ"అంతొద్దమ్మా కాస్త తగ్గు" దీన్ని కూడా కలుపుకోండి.

  ReplyDelete
 4. బాగున్నాయ్. నేను కూడా ఒకటి రాసేస్తెపోలా అనిపిచ్చి... "ఇంత సేపైతే నేనొప్పుకొను.......ఐతే ఓ.కే".

  ReplyDelete
 5. నా ఊతపదం "భలే! భలే!!"

  ఛా! అంతుందంటావా?

  ReplyDelete
 6. ఇంకొన్ని :

  నమస్కారం మాష్టారూ !
  ఓరినీఎంకమ్మా!
  ఎలాఉంది జీవితం?
  అంతా కులాశాయేనా / కుశలమేనా?

  ReplyDelete
 7. "ఇంకేంటి!?"
  ఇది వినబడగానే ఇంకేంలేవని అర్థంచేసుకోవాలన్నమాట.

  ReplyDelete
 8. idea bavundanDii.

  వీటిక్కూడా..
  సరే మరి.
  ఉంటానిక.

  ReplyDelete
 9. అంత దృశ్యం లేదు ,
  గోప్పోరే
  ఆయ్ చెప్పండి
  అబ్బా బలే చెప్పారు
  కెవ్వు కేక
  ప్రియతమా కుశలమా!

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.