Saturday, June 16, 2007

తనువిచ్చు తండ్రికిదె తొలి వందనం

లలిత గారి 'ఓనమాల' స్పూర్తిగా ఈ టపా. ఆవిడలాగా కవిత్వం చెప్పడంలో ఒరిజినాలిటీ లేదుకాబట్టి, శృతిలయలు సినిమాలో చివరి పాటకి ముందు పాడే ఒక చిన్న పద్యంతో నా జీవితానికి శృతి,లయలను సమకూర్చిన నా తల్లిదండ్రులకు నా వందనం తెల్పుకొంటున్నా.

వింటూ చదవాలంటే ఇక్కడ నొక్కండి.

తనదు వరసత్వమును
వారసత్వముగనిడి
తనువిచ్చు తండ్రికిదె తొలి వందనం

మమతానురాగాల కల్పతరువై
మంచిచెడు నేర్పించు మొదటి గురువై
ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు
మాతృపద పద్మములకిదె వందనం


సినిమాలో ఈపాట వచ్చే ఘట్టం చాలా రసవత్తరమైనది. విడిపోయిన చాలాకాలానికి రాజశేఖర్, సుమలతలు కలుసుకొన్న సందర్భం. ఈ సీను చూసిన ప్రతీ సారీ ఒక రకమైన ఉద్వేకం కలుగుతుంది. ఈసినిమా హీరో నాకు చాలా నచ్చింది. హీరోగా సుమలతని కాక ఇంకెవరిని పెట్టినా అంతబాగోదేమో అనిపించేంత బాగ నప్పింది. అసలు ఈ సినిమానే ఎన్నిసార్లు చూసానో తెలియదు. డౌన్లోడు చేసుకొని తెగచూసా. ఎన్నిసార్లు చూసినా నాకు చాలా మంచి అనుభూతిని కలుగచేస్తూనే ఉంది- శ్రీనివాసు ఓవరేక్షను ఎంత చిరాకు తెప్పించినా కూడా. అందులో ఒకచోట ఆమహానుభావులను వెలుగులోకి తీసుకొద్దామన్న వంకాయల ప్రతిపాదనని సత్యనారాయణ తిరస్కరిస్తూ సత్యనారాయణ వాళ్లని మనం వెలుగులోకి తిసుకురావడమేమిటని ఘాటుగా ప్రశ్నించడం నాకు చాలానచ్చింది. మనచుట్టూ వంకాయల లాంటి అజ్ఞానులు, పాంచాలమ్మ లాంటి కళా వ్యాపారులు చాలామందే కనిపిస్తారు.

సినిమా చివరలో....

త్రివర్గ ఫలదాసర్వే దాన యజ్ఞ జపాదయా
ఏకం సంగీతవిజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదమ్


ఇదే శృతిలయల సారాంశం

అని వస్తుంది. దయచేసి ఎవరైనా (బాసు గారు వింటున్నారా)దీని అర్ధం వ్రాయండి.

3 comments:

  1. సత్య సాయి గారు,

    నా టపా మీకు ఇంకొన్ని మంచి విషయాలు గుర్తు తెచ్చినందుకు, అవి మీరు అందరికీ తెలియ చేసినందుకు సంతోషంగా ఉంది.

    మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను నా ఆలోచనలు రాసానండి. అది కవిత లా అనిపించిందంటే సంతోషం.

    పిల్లలకు తల్లి మాత్రమే జన్మనివ్వ గలదు. కాని, బిడ్డ పెంపకం తల్లి దండ్రులిద్దరూ కలిసి చేసే పని.
    తండ్రిని గౌరవించుదాం. తండ్రి పాత్రను కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక సారి గుర్తు చేఉకుని అభినందిద్దాం తండ్రులను.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. సత్యసాయిగారు!, నాకు శ్లోకం ఐతే అర్థమయ్యింది అనుకుంటాకాని, సంగీత జ్ఞానమున్న వాళ్ళకే అందులో వున్న పరమార్థం తెలియాలి. నేను ఆ శ్లోకం అర్థం ప్రయత్నిస్తాను. మీకు సంగీత సాహిత్యాలలో అభిరుచి వున్నది కనుక మీరు దాని పరమార్థం ఏమిటో తిరుగు టాపా చేసినచో నేను చదువుకొని ఆనందించగలను.

    అర్థం: దానయజ్ఞజపాదులచేత సర్వజనులు మూడు విధములైన ఫలితాలను పొందుచున్నారు. సంగీత విజ్ఞానమొక్కటి నాలుగు విధములైన ఫలితములనొసంగుచున్నది.

    ఇక్కడ మూడువిధములనగా బహుశా దాన-యజ్ఞ-జపాదులు చతుర్విధపురుషార్థాలైన అర్థ -ధర్మ-మోక్షాదులకు చెందుతాయని నా అభిప్రాయము. మరి నాల్గవదైన కామితార్థము కూడా సంగీతముతో సాధ్యము అని ఆ పద్యము భావము అని నాకు తోచుచున్నది. సంస్కృత పండితులు మరి నా టపాలో తప్పులున్నచో మన్నించి సరిచేసి పద్యార్థమును తెలుపగలరు.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.