Thursday, July 26, 2007

నేనే పొరబడ్డానా?

పాపని పాతిపెట్టడం = మనుషులుగా చావడం టపాలో అదే అబ్బాయైతే అలా చేసేవారా అని వ్రాసా. ఆతర్వాత ఓనమాలు టపాలో అదే వాదనని బలపరుస్తూ ఒక వ్యాఖ్య వ్రాసా. తర్వాత కొన్ని రోజుల పాటు చిన్ని పాపల్ని, బాబుల్ని చెత్తకుండీలలో పాడేసిన కథనాలు వరుసగా పేపర్లలో వచ్చాయి. ఈ అకృత్యాలకి లింగ, మత భేదాలు లేవని చాటిచెప్పాయి. ముంబాయి లో లోఖండ్వాలా కాంప్లెక్స్ (కాందివిలీలో) అయితే రెండురోజుల చిన్ని బాబు 26 కత్తిపోట్లతో దొరికాడట. హతవిధీ! చిన్నారుల మీద ఇన్ని అకృత్యాలు చేయడానికి చేతులెలా వస్తున్నాయో. మనదృష్టికి రాని ఘోరాలెన్నో.

ఆడశిశువుల మీదే అకృత్యాలు జరుగుతున్నవన్న విషయంలో నేను పొరబడ్డా.
కానీ మనుషులుగా చచ్చిపోయామన్న విషయంలో మాత్రం కాదు.

2 comments:

  1. ఒరిస్సాలో ఇప్పుడు ఏం జరుగుతోందంటే :

    కడుపులో ఉన్నది మగపిల్లాడే అయినా, ఆ సంగతి డాక్టరమ్మలకి తెలిసినా, "ఆడపిల్లే" నని తల్లిదండ్రులతో చెప్పి గర్భవిచ్ఛిత్తి చేసేసి డబ్బు సంపాదించుకుంటున్నారట-ప్రసవం రోజు దాకా ఆగాల్సిన పనిలేకుండా.

    ReplyDelete
  2. హతవిధీ! అకృత్యాలు కూడా రోజురోజుకీ మరింత వికృతంగా అవుతున్నాయే!

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.