Monday, July 30, 2007

ఏనుగులు ప్రేమించుకున్నా, దెబ్బలాడుకున్నా.....

Monday, July 30, 2007

గుండెచప్పుడు లో వచ్చిన టపా ఈ మారణా హోమానికి స్క్రిప్ట్ రాసిందెవరు? చూడండి. ఏదో గూడుపుఠానీ వ్యవహారంలాగే ఉంది. ఈవ్యవహారంలో ''ఈనాడు'' యాజమాన్యానికి లింకు కాకతాళీయంలా లేదు. ప్రజల శ్రేయస్సుకోరి, నిజాలను (అంటే కొండొకచో వాళ్ళ స్వంత అభిప్రాయాలన్న మాట) నిర్భయంగా బయటపెట్టే ఈప్రచార సంస్థవారి న్యూస్ ఛానెల్ ఈటీవీ2 లో ముదిగొండ కాల్పులపై చర్చ ప్రతిధ్వని కార్యక్రమంలో కాసేపు చూసా. కాంగ్రేసు కామన్ శత్రువు కాబట్టి వారి ప్రతినిధి గొంతు, వాదన పెద్దగా వినిపించకుండా మోడరేటర్ తగుజాగ్రత్త తీసుకున్నారనిపించింది. ఒకాయన వాదం ఇలా సాగింది- ప్రజలు రాళ్ళు రువ్వారే అనుకోండి అంటూ పోలీసులమీద రాళ్ళురువ్వడం ఒక కల్పన అన్నట్లు మొదలెట్టాడు. తర్వాత 'అది నిజమే అనుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ (వీడియో క్లిప్పింగ్) చూస్తున్నాం కదా' అని కొనసాగించాడు. తర్వాత అందరూ పోలీసుల రాక్షసత్వాన్ని దుయ్యబట్టారు. కాంగ్రేస్ వాళ్ళ పాలన దుష్టపాలన అని దుయ్యబట్టారని, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరారని వేరే చెప్పక్కర్లేదనుకొంటా.

ఏనుగులు ప్రేమించుకున్నా, దెబ్బలాడుకున్నా నలిగేది గడ్డిపరకలే. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఉద్యమాలు నడిపినా, నేలకొరిగేది సామాన్య జనాలే. చావా గారి స్మృతులు చూడండి.



Posted by సత్యసాయి కొవ్వలి at Monday, July 30, 2007

Labels: మనుషులు, లోకంతీరు

Rate this:Avg:4.7/5 (3 votes)discover more!
tags

2 comments:
oremuna said...
ఈటీవీ అక్కడ ఉండటము అంత కాకతాళీయము కాదు
ఉదయం నుండి పరిస్తితి ఉద్రిక్తంగా ఉన్నది
అసలే ఆ మండలము ఎర్ర ఝండాలకు పట్టు ఉన్నది
ఇంతకుముందు కూడా చెదురు మదరు సంఘటనలు చాలా జరిగినాయి
మన ఘనత వహించిన తొమ్మిదివారికి పల్లెల్లో ఎంత నెట్వర్కు ఉన్నదో బహిరంగ రహస్యమే కదా
వార్తా విలేకరి కూడా ఉన్నాడు, చెట్టు వెనక ఉండి కాల్పుల నుండి తప్పించుకున్నట్టు అదే పత్రికలో వచ్చినది (ఎందుకు ఉన్నారని అడగలేదు కదా?)
రామోజీ అలా చేస్తున్నాడని మనము కూడా చిలువలు వలువలు చెయ్యకూడదు కదా
కొద్దిగా వృత్తము బయటకు వచ్చి ఆలోచిద్దాం

నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను :(

7/31/2007 3:55 AM
సత్యసాయి కొవ్వలి said...
మీరు చెప్పినది సబబుగా ఉంది. నేను వ్రాసినది మన నాయకుల చిత్తవృత్తిని గురించి. వారికి చనిపోయిన వారి మీద సానుభూతి లేదు. ప్రభుత్వం పడిపోవడానికి ఈసంఘటన ఎలా ఉపయోగిస్తుందా అన్న ఆలోచనే.

No comments:

Post a Comment

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.