Thursday, July 05, 2007

పాపని పాతిపెట్టడం = మనుషులుగా చావడం

మహబూబ్ నగర్ జిల్లాలో అప్పుడే పుట్టిన ఒక పాపని సజీవంగా పాతిపెట్టారట - ఈవేళ ఈ వార్త విని, చదివి, చూసే ఉంటారు. మనం ఇలా ఎందుకు దిగజారిపోతున్నాం? వార్తాకథనంలో, ఈ జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఇదివరలో కూడా జరిగాయని, కాని ప్రస్తుతపు పాప బతికి ఉండడంవల్ల ఈసంఘటనకి ప్రాముఖ్యత వచ్చిందని అర్ధమైంది. దీనికి బాధ్యులైన ఒక వ్యక్తి పేదరికం, అధికసంతానం వల్ల ఈపని చేసినట్లు తెలిపాడు. అదే మగపిల్లాడైతే ఇలా చేసేవారు కాదేమో. కేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన మనం ఇంత చిన్న సమస్యని అధిగమించలేమా? అవాంఛితగర్భాలని నిరోధించడానికి అనేకమార్గాలున్నాయి. కాని, అని పాటించడానికి మతం అడ్డొస్తుంది. పసికందుపట్ల ఇంత ఘోరం చేయడానికి మతం అడ్డురాదా? ఎవరు చేసినా, ఏకారణంగా చేసినా మనం మనుషులం అని చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అమానుషమైన సంఘటన.

9 comments:

 1. నా దృష్టిలో అబార్షను చేయించుకోవడం = మనిషిగా చావడం

  ReplyDelete
 2. చట్టం ఆ పాప హక్కులను కాపాడక, వాడికి తగిన శిక్ష పడకపోతే = చట్టం చావడం

  ReplyDelete
 3. సత్యసాయి గారూ, ఏమీటి, ఎక్కడ, ఎలా జరిగిందీ దారుణం..లింకండీ?? బాబు

  ReplyDelete
 4. నిన్నంతా అన్ని టీవీల్లోనూ ఇదే వార్త. దీని లింక్

  http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar

  ReplyDelete
 5. అబ్దుల్‌ రహమాన్‌కు ఏడుగురు కుమార్తెలు.ఈ మనవరాలూ రెండవ కూతురి బిడ్డ.
  ఆర్ధిక సమస్యలు. సాకలేక పాతి పెట్టాను అని అంటున్నాడు
  అతనికి ఆర్ధికమైన వేసులుబాటువుంటే అలా చేసేవాడు కాదేమొ.

  ReplyDelete
 6. ఆర్ధికం గా కష్టమైన మాట నిజమే ఐనా చంపే హక్కు లేదు కదా. మరేం చెయ్యాలి అంటే...ఏమో, కొంచం మానవత్వం తో ఆలోచిస్తే వేరే ఏదోక పరిష్కారం దొరక్క పోదు.

  ReplyDelete
 7. ఆ act అమానుషం. అందులో సందేహానికి, వివాదానికి తావు లేదు. పరిస్థితులను అర్థం చేసుకోగలమేమో కాని ఆ పనిని మాత్రం సమర్థించలేం. పేదరికం వల్ల చంపడమో, చంపినంత పని చెయ్యడమో జరిగుతూనే ఉంటున్నాయి. ఇలాంటి విషయాలలో ప్రభుత్వం, చుట్టూ ఉన్న community పూనుకోవాలి. ప్రతి చోటా ఏవో ఒక సేవ సంస్థలు, మహిళా సంఘాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వారు educate చెయాలి. సమాజంలో సమాజం గురించి, కాస్త మెరుగైన స్థితిలో ఉన్న వారు అందించ గల సాయం గురించి అవగాహన పెరగాలి. సామాజిక స్పృహ పెరగాలి. సంచలనం తగ్గాక ఈ విషయం గురించి ఎంతమదిమి ఆలోచిస్తాము?

  సరే, ఇప్పుడు ఆ పాపకి ఆ తర్వాత ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉండాలని ప్రార్థిద్దాము.

  ఇలాంటి విషయాలు చదివినప్పుడు అనిపిస్తుంది. కటిక పేదరికంలో పుట్టిన పిల్లల "జీవితం" వారు పెరిగే కొద్దీ ఎలా ఉంటుంది అని? చంపడం తప్పు. బ్రతికిన వారు ఏ పరిస్థితులలో బ్రతుకు వెళ్ళదీస్తుంటారు?

  చాలా పెద్ద ఎత్తున సమాజం ముందుకు రావల్సి ఉంది, బాధ్యత తీసుకోవలసి ఉంది.

  ReplyDelete
 8. నెటిజన్ గారు
  ఆర్ధిక పరిస్తితి బాగాలేక 7గురిని కన్నాడంటారా? సమర్ధించాలంటే ఏవెధవ పనినైనా సమర్ధించచ్చు.

  ReplyDelete
 9. కాని మరిసటిరోజే ఆ పాప తన బిడ్డ కాదని ఆ పద్నాలుగేళ్ళ తల్లి అంటుంది. కాని పిల్లలు లేని మరో జంట ఆ పాపను పెంచుకోవడానికి ముందుకొచ్చారు. ఇంకో సంఘటన జరిగింది. ఒక తల్లి పుట్టిన ఆడపిల్లను ఆసుపత్రి మెట్లపై వదిలేసి వెళ్ళింది. పాపం ముద్దుగా ఉన్న ఆ పాప వంటినిండా ఎర్రచీమలు . దద్దుర్లు.బాధతో ఏడుస్తున్న పాపను నర్సులు తీసి శుభ్రపరచి పాలు తాగించారు. ఇది మరీ మానుషం కదా. ఇంకో సంఘటన కూడా జరిగింది. ఉస్మానియాలో ఒక మైనర్ బాలిక వాళ్ళ పెదనాన్న కొడుకు అనుభవించితే గర్భవతై ఆడపిల్లను మరుగుదొడ్డిలో కంది. ఆ పిల్లను వాష్ బేసిన్‍లో పడేసి వెళ్ళిపోయారంట. ఆ పాప చనిపోయింది.

  ఆడపిల్లల పట్ల ఇంత అమానుషం ఎందుకు? దీనికి కారణం ఏమిటీ..డబ్బా..ఈరోజుల్లో ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా చదివి సంపాదిస్తున్నారు కదా.ఇద్దరికీ చదువులకు , పెళ్ళిళ్ళకు ఒకే ఖర్చు.

  ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.