Monday, April 07, 2008

ఉగాది శుభాకాంక్షలు

సర్వధారి నామ సంవత్సరం మీఅందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ, బ్లాగులు రాసే బుద్ధినీ, బ్లాగ్వృద్ధినీ ఇవ్వాలనీ నా బ్లాగ్ముఖంగా కోరుకుంటున్నా.
ఈఉగాది తెలుగు బ్లాగరులకి మరిచిపోలేని రోజు. ఒక యుగాది. ప్రవీణ్ ధృఢసంకల్పంతో, దీక్షగా తెలుగుబ్లాగులని ఒక సంకలనంగా తీసుకురావడం తెబ్లా చరిత్రలో ఒక మైలురాయి. రావు గారూ- ప్లీజ్.. నోట్ దిస్పాయింటు. వీవెనుడి ముఖపత్ర వీవింగు నిరాడంబరతలో కూడా సౌందర్యం నింపచ్చని తెలిపింది. ఎంపిక చేసిన టపాలని వివిధ శీర్షికల కింద క్రోడీకరించి పుస్తకాన్ని తీర్చిదిద్దిన ప్రవీణుడి ప్రావీణ్యం మెచ్చుకోదగింది. ఆయనకి అభినందనలు. ఈ పుస్తకం ఇక్కడ ఉంది-- తెలుగు బ్లాగుల సంకలనం.
ఈ పుస్తకాన్ని పదిమందికి పంపించిన రామయ్య గారి బ్లాగుకి విజిటర్ల తాకిడి విపరీతంగా పెరిగింది. సోమయ్యగారి బ్లాగులో అనేకమంది సువ్యాఖ్యలు కుమ్మరించారు. దాంతో వాళ్ళు మహాబ్లాగర్లయిపోయారు. ఇదంతా ట్రాషని కొట్టిపాడేసిన దానయ్యగారి బ్లాగుకి విజిటర్లసలు రాకపోవడంవల్ల విలపిస్తోనే ఉన్నారు. అందుకని మీరు వెంటనే ఓపది మంది తెలుగువాళ్ళకి ఈపుస్తకాన్ని కాని, దాని లింకునికానీ పంపించి మహా బ్లాగర్లయిపోండి.

3 comments:

  1. భలే చమత్కారులు సార్ మీరు :)

    ReplyDelete
  2. పనిలొ పనిగా ఉగాది నాదు ఈ బుక్కు డౌన్లోడు చేసుకుని పఠించిన వారు ఈ సంవత్సరమంతా మూడు బ్లాగులూ, ఆరువందల హిట్లుగా వర్ధిల్లుతారని కూడా చెప్పండి.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.