Sunday, September 28, 2008

ఈఅనంతవిశ్వములో నేనెంతటివాడను

మనభూమి సౌరకుటుంబంలోని ఓ చిన్న గ్రహం. అంతరిక్షంలో అలాంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో, ఈవిశ్వంలో అలాంటిఅంతరిక్షాలెన్నో? నాకేమో తెలియదు, మీకైనా తెలుసునా? అలాంటి విశ్వంలో మన ఉనికి ఎంత అల్పమో, స్వల్పమో ఎపుడైనా ఆలోచించారా? సుకవి శ్రీ వక్కలంక లక్ష్మీపతిశర్మగారి మస్తిష్కంలో మెరిసిన ఒక ఆలోచన ఫలితం ఇక్కడిచ్చిన ఈలలితగీతం.

నేవిన్నది – శ్రీ మల్లాది సూరిబాబు స్వరంలో
మీరువింటున్నది నా అపస్వరంలో, శృతిలయలకతీతంగా, ఉచ్ఛ్వాసనిశ్వాస సహితంగా,నాకు గుర్తున్న విధంగా

పల్లవి – ఈఅనంతవిశ్వములో నేనెంతటివాడను
అణువునైన అందునా పరమాణువైన అవుదునా

చ 1. పర్వతములముందు నేను పరమాణువునైనకాను
ఉదధిముందు నేనిలచిన ఒకబిందువునైన కాను

చ2. జగదీశుడు నాలో సదా వెలుగుతున్నాడట
సృష్ఠికర్త నేనేనట సృష్టియంత నేనేయట

చ3. నాలోనే ఉన్నవాడు నాకగబడడేమో కాని
ఈదాగుడుమూతలేమి ఈసృష్ఠివిచిత్రమేమి
(ఈటపా కి స్పూర్తి రానారె పాత(ట) టపాః- గడిచేనటే సఖీ ఈరాతిరీ. ఆయనకి నెనర్లు)

8 comments:

  1. బ్రహ్మాండంగా పాడారు సార్!
    ముందు రానారె, తరవాత నేనూ (ఇంకే మిత్రకేసరులైనా చేశారేమో తెలీదు) ఆడీయో టపాలు పూయిస్తామని ఉత్తరకుమారుని ప్రగల్భాలు పలికి ఆరంభ్శూరులంగా ఉత్త కుమారులుగా మిగిలి పోయాము. మీరైనా తరచూ ప్రకటిస్తే బహు బాగుంటుంది.
    చాలా ఎంజాయ్ చేశాను.

    ReplyDelete
  2. చాలాచాలాచాలా బాగా పాడారు, నేనైతే మొదట మంగళం పల్లి బాలమురళీ పాడారా అనుకున్నా, కాస్త అలాగే ఉంది మీ స్వరం.

    ReplyDelete
  3. మీ గొంతు బాగుంది సార్. కానీ పాట బాణీ ఆకట్టుకునేలా లేదు.

    ReplyDelete
  4. ఆచార్యా,

    పాట మొదట్లో ఆలాపన వినగానే మీరు పాడింది కాదేమోననుకున్నాను. అంత నాణ్యంగా వుంది రికార్డింగ్. చాలా బాగా పాడారు. ఈ పాటకు బాణీ మీరు ఇంతకు ముందు కూర్చి పాడిన 'ఎన్ని సారులు విన్ననూ' పాట బాణీకి దగ్గరగా వుందనిపించింది. రెండూ ఒకే రాగం మీద ఆధారపడినవేమో తెలిసివాళ్లు చెప్పాలి.

    ReplyDelete
  5. చాలా బాగుంది మీ వాయిస్.

    ReplyDelete
  6. మీ గొంతు చాలా బాగుంది. ఇంకా ఎన్నో మీ నుండి ఆశిస్తూ....

    ReplyDelete
  7. @కొపా గారు - నెనరులు. అభిమానం అతిశయోక్తికి దారితీస్తుందేమోః))
    @రమ్యగారు - నెనర్లు. అయుండచ్చు - భ్రమరకీటకన్యాయం పని చేసుండచ్చు - ఆయన పాటలు వినీవినీ.
    @తెరెసా, చైతన్య, చంద్ర గారలు - నెనర్లు
    @రానారె -నెనర్లు. ఈపాటలో స్వరాలు తక్కువ రెంజిలోనే తిరుగుతాయి - భజన పాటల్లాగ. అందుకే మధ్యమం ఆధారంగా పాడా - ఎఫేక్టు కోసం. రెండూ వేర్వేరు రాగాలని చెప్పగలను. ఒకేలా పాడానాః)) ఎన్నిసారులు - ద్విజావంతి. ఈఅనంతవిశ్వము .. తెలియదు.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.