Thursday, October 02, 2008

మినీ గడి

ఈనెల గడి ఇంకా రాలేదని కొందరు నిరుత్సాహపడడం గమనించి ఓ మినీ గడి తయారు చేసా. కేవలం బ్లాగు నామాల తో పూరించాల్సిన గడి. కూడళ్ళ జోలికి పోకుండా పూరించడానికి ప్రయత్నించండి. సరియైన సమాధానాలని 29 తో భాగించి వందతో గుణిస్తే వచ్చే సంఖ్య మీ తె.బి.క్యూ. (B.Q.) – Telugu Blog Quotient. మీరు సమాధానాలు పంపండి- తెబీక్యూ నేను చెప్తా. ఈగడిలో కేవలం కొన్ని బ్లాగుల పేర్లనే వాడా. ఇది కేవలం సౌకర్యం కోసమే కానీ బ్లాగుల ప్రతిష్ఠ, వాసి, రాసులతో సంబంధం లేదని మనవి చేసుకుంటున్నా. సాధ్యమైనంతవరకూ ఒళ్ళుదగ్గర పెట్టుకునే ఆధారాలు రాసా- మరీ చప్పగా ఉంటుందని కొద్దిగా పెప్పరేసా, అయినా ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేస్తే తొలగిస్తా. ఈమధ్యకాలంలో జనాల మనోభావాలు తెగదెబ్బతింటున్నాయి కదా. మా చింతలబస్తీలో మొన్న మనోభావాలు దెబ్బతిని కొట్టుకున్నారట కూడా!

ఈ గడిని పొద్దుకు కూడా పంపిస్తున్నా. అక్కడ ఇమడగలిగితే, వారు ప్రచురిస్తారు. అక్కడే మీరు పూరించచ్చు. మినీగడి వర్డు ఫైలు ఈస్నిప్సు డాట్ కాం లో పెట్టా. దింపండి, నింపండి, పంపండి. మీ సౌకర్యార్ధం సోమవారం పొద్దులో వస్తుంది


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27


ఆధారాలు - అడ్డం
1. వేడివేడిగా పదునుగా ఎండగట్టే బ్లాగు
3. సేదతీరుదామని ఈబ్లాగుకొస్తే -రోజుకో టపా గారంటీ కానీ - వేడీ, వాదం తప్పవు- సీతారాములెలా ఉండేవారో పాపం
5. కందం తెలిసిన బ్యూటిఫుల్ బ్లాగు
7. తెలుగు వెనక్కి తూలితే ... ఈచుట్టుపక్కలంతా తెలుగే తెలుగు
8. బ్లాగరే మనిషైతే .. బ్లాగు జంతువవదుకదా
9. శబ్దం. కానీ కృష్ణుడూదేది - ఐదులో పుట్టినది -సముద్రం లోదొరికేది ముందు కలిపితే బ్లాగు పేరు.
10. నిజం బ్లాగు అబద్ధాలు చెప్తోందని నిజాలు చెప్పడానికి ఈబ్లాగు వచ్చింది. నిజాలూ, అబద్ధాలూ కలిసే పోయాయి.
11. ' - - ' లోకానికి స్వాగతం చెప్పే బ్లాగు
12. ఈవిడ మాది అనిచెప్పేది మాదికూడానూ.. అక్కడ ఎక్కడ చూసినా వరే.
14. స్కిల్
16. పేరులో హస్కింగు - టపాల్లో పౌండింగు
18. శాస్త్రిని కాదని ఆయన ఇంటి పేరును వాడుకున్న బ్లాగు
19. ఇన్మై దిల్లని చెప్పే నాన్-టేక్కీల హృదయానికి కూడా హత్తుకునే బ్లాగు - ఒకేపేరుతో రెండు బ్లాగులున్నాయి - ఒకటి 3-డాట్, ఇంకోటి 5-డాట్ బ్లాగు - అవునూ, ఇంతకీ - దిల్మేనా?
21. లెక్కల్లో పూరేమో గానీ, హాస్యంలో ఘుమఘుమలాడే మరిగే నీళ్ళలాంటివాడు
23. పుస్తకాలు చదువుతారా బార్బేరియస్ - ఈవిడ బ్లాగు చదివితే పోలే
24. వంటల బ్లాగు గురూ అని గుర్తు చేసే బ్లాగు
26. ఈ జోకులు మనదేశానివేనట - ఇంకో రెండురోజుల్లో విజయదశమి పెట్టుకుని మీతో అబద్ధమా
27. న్యూనిబ్ - ఓల్డ్సిరా - అందుకే ఎడాపెడా రాతలు

ఆధారాలు - నిలువు
1. గుర్రాలతో నడిచేబండి, ఎన్టీఆర్ తెచ్చిన చైతన్యంతో రానాల బండిగా మారింది. నాటి -నేటి విషయాలందించే తెలుగున్న ప్రతిభావంత బ్లాగు
2. తలకిందులైనా తెలుగు తెలుగే - మిత్రుడు తిన్నంగా ఉంటే చాలుగా
4. కవితల మహా బ్లాగు - కిందనించి పైకి - నాల్గో అక్షరం సరియైన ప్లేసే - మేఘసందేశాలు పంపడం తెలియక పోయినా బ్లాగడం తెలిసిన ముగ్ధ మనోహర బ్లాగు.
6. కింద పెట్టినా పైకి రాగలిగేది - బాదరాయణుడి భిక్ష - ఒక పండితుడి బ్లాగు
10. ప్రథమా విభక్తి ప్రత్యయం తో బహువచనం చేయండి - మంచి స్వరభరితమైన బ్లాగొస్తుంది
13. తెలుగు ఆచార్యుల వారి బ్లాగింటి పేరే సాగదీస్తేఎలా..
15. ఆస్సిన్ ఫోటోలనే భ్రాంతి కలిగించి మభ్యపెట్టే శీర్షిక తో టపా రాసిన బ్లాగ్ట్రావెలర్ - అవుడియా కింగు
17. ' do not put all your eggs in the same basket' అని విని తన కూరల్ని వేర్వేరు బుట్టల్లో సర్దిన బ్లాగా ? ఎక్కడ సర్దినా ఈయన కూరల రుచి అనితర సాధ్యం
20. మంచిరుచైన టపాలందించే జ్ఞానమయ బ్లాగు
22. ఈపిల్లాడు తెలుగు గడుగ్గాయి - తికమక పెట్టేస్తాడు - గ్రామర్ నేర్చుకుంటున్నాడట బడాయి- గజడదబల్ని కచటతపలు చేస్తున్నాడు -గోపాళానికి చెప్తే సరి.
25. మునిసిపాలిటీ బండిలో వేస్తారా - ఇంకా నయం. ఇది కథల బ్లాగండీ బాబూ

12 comments:

  1. ఆచార్యుల వారూ, ఒక్కసారి మరలా గడుల సంఖ్య చూస్తారా? ఏంటో నాకు కాస్త తికమకగా ఉంది.

    ReplyDelete
  2. నెనర్లు. సరి చేసా. బులెట్లతో ఇదే సమస్యః))

    ReplyDelete
  3. మాష్టారు ఎలా పూర్తి చెయ్యాలి
    కాపీ చేద్దామన్నా రావటం లేదు
    చెప్పి పుణ్యం కట్టుకుందురూ

    ReplyDelete
  4. లచ్చిమి గారు, వర్డుఫైలుకి లంకెయిచ్చా. థాంకులు.

    ReplyDelete
  5. మీరింకొక సారి గడి లెక్కలు సరి చూడాలి మాస్టారు!

    ReplyDelete
  6. సరిగానే ఉన్నట్లుంది. ఎక్కడ సమస్యగా ఉందో చెప్పితే చూస్తాను

    ReplyDelete
  7. ఏంటో బాంబులు, పిట్టలు, నెలవంకలు, స్మైలీలు..రకరకాల బొమ్మలు పెట్టారు. అవన్ని డమ్మీ గడులే కదా! ఇంకొకసారి చూస్తా లేండి. esnips లో పెట్టిందాంట్లో 1 అడ్డానికి ఎక్కడా మద్య అడ్డంకులేం లేవు!!!

    ReplyDelete
  8. 9 అడ్డం? ఇలా గడులన్ని డమ్మీ చేసేస్తే ఎలా ఆండి?

    ReplyDelete
  9. siri siri muvva gaaru naaku aa download kaavatm ledu
    kaasata meeru naaku pampincharoo pleaseeeeee
    naa mail id bapu.bommase@gmail.com

    ReplyDelete
  10. పొద్దులో పెట్టిన దానిలో 14 నిలువు తీసేసారే, మరి నాలగవ గడి అట్టేపెట్టారు.

    ReplyDelete
  11. నింపి పొద్దుకి పంపేసా. 23 అడ్డం నింపాను కాని, ఇచ్చిన ఆధారం సరైనదేనా అని నాకు కొంచం సందేహం.

    ReplyDelete
  12. ఇక పై పొద్దులో నింపండి. నల్లులని(బగ్స్) తీసేసాం.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.