Thursday, November 27, 2008

పాపం పోలీసులు

రోజూలాగే తెల్లారినా, రాత్రి ముంబాయిలో 10 చోట్ల జరిగిన తీవ్రవాదుల కాల్పులు, స్వైరవిహారం కని (టీవీలో), విని ఎంతమందికి తెల్లవారలేదో, ఎంతమంది జీవితాలు చీకటిలో కెళ్ళిపోయాయో తలుచుకుంటే మనసంతా ఏదోలా అయిపోయింది. మా అబ్బాయైతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామని గొడవ. మా అమ్మాయికి ఎవరూ ఏమీ చేయలేరా అన్న నిస్పృహ. కాస్త చదవేస్తే హిందూ తీవ్రవాదమా, ఇస్లాం తీవ్రవాదమా అన్న మీమాంసలో పడిఉండేవారు. ఇంకా బాగా చదవేస్తే ఇంకా పనికిమాలిన వాదాల్లో పడి అంత బాధ పడుండేవాళ్ళు కారేమో.

అదలా ఉంచితే, ఇంక అందరూ పోలీసుల వైఫల్యం మీద లెక్చర్లు మొదలెడతారు. టెర్రర్ సంఘటనైనా, దొంగతనమైనా, మతకల్లోలాలైనా, సమస్య ఏదైనా అక్షింతలు పోలీసులకే. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు పాపం పోలీసులే పాపాల భైరవులు. ఒక వర్గంవాళ్ళని పట్టుకుంటే వేరేవాళ్ళని పట్టుకోలేదేమని ప్రశ్నిస్తారు. సరేనని ఎవరినీ పట్టుకోక పోతే ఇంకో తంటా. నేరస్థులని పట్టుకుని మర్యాదగా సారూ మీకు ఈపేలుళ్ళతో సంబంధముందా అని అడిగి, వాళ్ళు అబ్బే లేదంటే, చెవిలో పువ్వెట్టేసుకుని వదిలేయాలి. లేక పోతే మానవ హక్కుల ఉల్లంఘన. అసలు పోలీసులూ, వాళ్ళ కుటుంబ సభ్యులూ మనుషులేనని మనకెవ్వరికీ కనీస స్పృహ ఉండదు. ఈవేళ్టి దాడిలో 11 పైగా పోలీసులు చనిపోయారు. అందులోనూ ముఠాలకే సింహస్వప్నమైన సలాస్కర్ కూడా ఉన్నాడు. ఆమధ్య ప్రదీప్ శర్మ, దయా నాయక్ లాంటి ఎన్ కౌంటరు నిపుణులని సస్పెండు చేసి, వాళ్ళమీద కేసులేసి ప్రాణాలొడ్డి పని చేస్తున్న పోలీసుల ఋణం ఎలాతీర్చుకోవచ్చో మహారాష్ట్ర ప్రభుత్వం చూపించింది.

See the following reaction to criticism of police after bomb blasts of Mumbai a few years ago. The critics are so called intellectuals who wrote articles in Economic and Political Weekly.

"The main claims of all these articles combined are that: (1) the police are biased against Muslims; (2) They did not respect human rights of Muslims in the aftermath of Mumbai bomb blasts; (3) after the blasts they rounded off the Muslim areas and arrested 1500 Muslims. (4) They do not treat Hindus the same way.

The argument that police is not treating the Hindus the same way and are biased against Muslims is a thoroughly demoralizing statement. This is so because, in the same article the authors acknowledged that most of the 1500 Muslims rounded off were released unhurt soon. Also these articles reported that police did not assault educated Muslims taken into custody. The articles further highlighted the positive response of the police commissioner in respect of avoiding arrests in the places of work like school! That is, police is not completely insensitive to the feedback from the public. The working of police as every one of us knows is always the same way with anybody. They are prone to such stereotyping to start with. Let us not miss the point that they work under lot of pressure from government and public especially whenever such major incidents like Mumbai blasts happen. We all expect miracles from them. We are all ready to question them, 'could they not keep an eye on this sect or those sections' and if they target any sect we are again the first people to question why they are targeting them. See what the EPW editorial ( Sept 2, 2006) said, "Security forces virtually laid siege to the Muslim dominated city of Aurangabad where 30 kg of RDX was seized earlier in the year". If police do not go and search in Aurangabad where they seized RDX earlier, will they not be accused of ignoring clues, neglect of duty and shaking hands with terrorists? Daily Press is hungry for such headlines. Do not mistake the above arguments for my justification of the methods of the police. My only submission is that nothing much should be deduced about anti-Muslim bias from this otherwise common approach of the police.

The articles also criticized police for lifting the cap of a Muslim and the immigration people for turning away a person due to damaged passport. These things, any international traveller will see as the most common and normal things happening to anybody and everybody. Due to the liquid bomb threat all the passengers were subject to thorough checking and they are not allowed to carry even toothpaste, water and anything which security people objected to. Caps were lifted as well in front of my own eyes. Imagine the trouble to the passengers. Imagine the cost imposed ultimately on the common man. It is better to understand that police and immigration people examine everyone with the hypothesis that everybody is a potential threat to security and they cannot take chances. Here, in the whole process one should understand the compulsions of the police and others to impress on and reassure the public about their discharging of duty."

గుడ్డిలో మెల్ల – కేంద్ర సహాయమంత్రి చనిపోయిన పోలీసుల కుటుంబాలు తమ భవిష్యత్తు గురించి దిగులు పడనవస్రం లేకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చి నా మనసుని కదిలించాడు. ఎలక్షన్ హామీలా దీన్ని మరచిపోకుండా ఉండాలని ఆదేవుడిని ప్రార్ధిస్తూ....

5 comments:

  1. మీరు వ్రాసిన బ్లాగ్ లో ఆఖర్న అన్నట్లుగా పోలీసులు,సైన్యం చేసిన త్యాగాన్ని మరచిపోకుండా ఉంటే చాలా బాగుంటుంది.

    ReplyDelete
  2. Since yesterday I am waiting for a post from you as you are living in Mumbai you know extacly what is going on in Mumbai.
    ---
    ఆమధ్య ప్రదీప్ శర్మ, దయా నాయక్ లాంటి ఎన్ కౌంటరు నిపుణులని సస్పెండు చేసి, వాళ్ళమీద కేసులేసి ప్రాణాలొడ్డి పని చేస్తున్న పోలీసుల ఋణం ఎలాతీర్చుకోవచ్చో మహారాష్ట్ర ప్రభుత్వం చూపించింది.

    Yes I will agree with you 100% for. not only the government all the people will should feel shame for this. These kind of actions act against the morality of the Police who work sincerely for the people.

    ఇంకా అప్పుడే ఏముంది ఇంకా ఎంతమంది కుహన లౌకికవాదుల వాదనలు మనం ముందు ముందు వినాలో ఈ విషయం లో కూడా.

    ఈ సంఘటన లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నా సెల్యూట్!

    ReplyDelete
  3. మా ఏరియా ఘటనా స్థలానికి దూరంగా ఉన్నా, మా చుట్టుపక్కల రోడ్ల మీద జన, వాహన సంచారం అతి పలచగా ఉంది. కూరానారా అమ్ముకునేవాళ్ళు మార్కెట్లో కనిపిస్తున్నా ఎవరి మొహాల్లోనూ కళా కాంతులు లేవు, భయం ,బెరుకూ తప్ప. టీవీల్లో కమాండో ఆపరేషన్ హాలీవుడ్ టెర్రర్ సినిమాకి తక్కువ లేకుండా ఉంది. కానీ సినిమా కాదని తెలుసు కనుక ఎక్కడో ఏదో కదలిక.

    ReplyDelete
  4. మీ అభిప్రాయాలతో 100% ఏకీభవిస్తున్నాను.
    వాళ్ల ప్రాణాలనే పణంగా పెట్టి నప్పుడు మాత్రమే వారిని విశ్వసించేటంతటి థిక్ స్కిన్న్ డ్ గా సమాజం మారిపోవటం చాలా దారుణం.
    హేమంత్ కార్కర్ గురించి తెలుసుకొని, అంత మంచి అధికారిని మనం కోల్పోయినందుకు చాలా బాధనిపించింది.

    ReplyDelete
  5. lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi
    durgeswara.blogspot.com

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.