తాజ్ హోటల్ ప్రస్తుత పరిస్థితి చూసాక మనసంతా బాధతో నిండిపోయింది. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరి నుండి చూస్తేకనిపించే మేరునగంలా కనిపించే చారిత్రక కట్టడం ఇది. ఒకటి రెండుసార్లు ఎవరినో కలవడానికి లోపలికి వెళ్ళినా, బయటినుంచి ఎంతసేపైనా చూస్తూఉండిపోవాలనిపించే అందమైన అతిపేద్ద భవనం ఇది. దాని సొగసు, హొయలూ ఇప్పుడు గతకాలపు వైభవం. టీవీలో చూస్తోంటే దీన్ని తిరిగి పాత తాజ్ లా చేయాలంటే చాలాకాలం పడుతుంది. డబ్బు నష్టం కంపెనీదైనా, అసలు నష్టం దేశానిదే అని పిస్తుంది దీని వందేళ్ళ పైబడిన చరిత్ర వింటే. ఈహోటల్లో బెర్నార్డ్ షా. బార్బారా కార్టలాండ్ లాంటి హేమాహేమీలు బసచేసారట. తెల్లవాళ్ళ హోటల్లో తనని రానివ్వకపోవడంతో జంషడ్జీ నసెర్వాన్జీ టాటా ఈహోటల్ని కట్టాడట. ఇందులో సరోజినీ నాయుడు 3 దశాబ్దాల పాటు ఓసూట్ తనకోసం ఉంచుకున్నారట. శారదా ద్వివేదీ తను రాసిన అప్రచురిత పుస్తకం తాజ్ ఎట్ అపోలో బందర్ అన్న పుస్తకం లో తాజ్ చరిత్ర పొందుపర్చారట.
వహ్ తాజ్ ....
ముంబైకి టాటా కానుక. ఈ రోజు హిందూ పేపర్లో తాజ్ గురించిన కథనం http://www.hindu.com/2008/11/29/stories/2008112955770900.htm
ReplyDelete