You may have winning ideas. But you need much more to win the game.
ఒబామా గెలిచిన సందర్భంలో వెల్ష్ (Jack and Suzy Welch) తను రాసిన Barack Obama's Victory: Three Lessons for Business - అన్న వ్యాసంలో ఒబామా గెలుపు, మెకెయిన్ ఓటముల నుండి వ్యాపారస్తులు నేర్వగల 3 సూత్రాలు వెలికి తీసారు..
అవి –
స్పష్టమైన, నిశ్చితమైన దార్శనికత.
కార్య నిర్వహణ – అనుకున్నవి ఆచరణలో పెట్టడం.
మనకి అనుకూలురైన, మంచి స్థాయిలలో ఉన్న స్నేహితులు
ఏది ఏమైనా గెల్చినవాడే మొనగాడు.
ఒబామా ఏదో చేసేస్తాడు, ప్రపంచాన్ని మార్చేస్తాడని ఆశించక్కరలేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోయే స్థితి దాటిపోతే సుఖం.
బాగా చెప్పారు
ReplyDeleteకానీ, ఒబామాపై చాలానే ఆశలు పెట్టుకున్నారు - కనీసం అమెరికా వాళ్ళు. నిన్నటి విజయోత్సవ సంరంభంలో నేనో ప్లాకార్డు చూసాను - "వెయ్‌ట్, హెల్ప్ ఈస్ ఆన్ ది వే" అని. మన నాయకులు మన నమ్మకాలను వమ్ము చెయ్యడం ఎంత మామూలైపోయిందో, వాళ్ళ మీద మనం ఆశలు పెట్టుకోడం కూడా అంతే సహజమై పోయింది. ప్రపంచంలో సామాన్యుడెక్కడైనా అంతేనేమో!
ReplyDeleteగెల్చినవాడు నిస్సందేహంగా మొనగాడే! ఓడిన మెక్కెయిను కూడా మొనగాడి లాగానే అనిపించాడు. బాగా మాట్టాడాడు. 'అయిపోయింది, ఇవ్వాళ్టితో యుద్ధం ముగిసింది, ఇక రేపటి నుండి అమెరికా కోసం కలిసి పనిచేద్దాం' అంటూ స్ఫూర్తి నింపాడు. 'మీరేం తప్పు చెయ్యలేదు, తప్పులేమైనా జరిగుంటే అవి నావే' అని అన్నాడు. బుష్షు చూసారుగా.. నిన్నంతా ఎక్కడా కనబళ్ళేదంట! :) అధికారాంతమునందు చూడవలె అయ్య సౌభాగ్యముల్..
ఒబామా వచ్చి ఏదో ఉద్ధరించేస్తాడనే భ్రమ నాకేమీ లేదు. ఖర్మచాలక ఏవైనా పొఱపాట్లు జరిగితే "ఛ ! ఈసారి తెల్లవాణ్ణే ఎన్నుకుందాం పదండి" అనేవాళ్ళు కూడా బయల్దేఱతారు. పిచ్చిలోకం ! పిచ్చి ప్రజలు !!
ReplyDeleteకొత్తొక వింత పాతొక రోత
ReplyDelete