పర్ణశాల మహేష్ (నేను) అసలెందుకు రాయాలి? అని జూలై లో రాసిన టపా, వేరే టపాలో వ్యాఖ్యలు చదువుతోంటే ఆయనిచ్చిన లంకె ద్వారా ఈవేళ నా కళ్ళబడింది. ఆటపా, దానికి వచ్చిన వ్యాఖ్యలు చూస్తే బ్లాగర్లందరూ ఇంచుమించు ఒకే ప్రేరణ/ ఉద్దేశ్యంతో బ్లాగుతున్నారని అర్ధమయింది. దాంతో జనవరి 2006 పొద్దు లో వచ్చిన నేనెందుకు ‘బ్లాగు’తున్నాను? అన్న వ్యాసం గుర్తొచ్చింది. దాన్లో నేను చివరిచ్చిన పేరడీ పద్యభాగం --
ఏల బ్లాగింతును?
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల సత్యసాయి ‘బ్లాగించు’ నిటులు
మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల ‘బ్లాగుటేల’?
పరుల తనయించుటకొ? తన ‘బ్లాగు’ కొరకొ
‘బ్లాగు’యొనరింపక బ్రతుకు గడవబోకొ?
వ్యాసం పూర్తిగా చదవాలంటే పొద్దులో నేనెందుకు ‘బ్లాగు’తున్నాను? చదవండి.
యాదృచ్చికమేనా ఈ టపా, లేక ఏమైనా కుట్ర ఉందా!!
ReplyDeleteఆచార్యులవారూ ... పద్యం అదరహో.
ReplyDeleteవరూధినిగారు,
ReplyDeleteఇది యాదృచ్చికమేనండి. మన సీక్రెట్ ఎక్కడా లీక్ అవ్వలేదు. సత్యసాయిగారు కుట్ర చేయలేరు అనుకుంటా? ఏమో మరి? ఈ రోజుల్లో మగవాళ్లనే నమ్మలేకుండా ఉన్నాము!
padyam chala bagundi
ReplyDeleteఏల ప్రేమింతును ?
ReplyDeleteదేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిచే రచించబడ్డ ...కృష్ణపక్షము