కొత్తపాళీగారి కొత్తసూచన, ప్రవీణ్ ప్రధమవిన్యాసం, రానారె 'వీర'కృత్యాల స్ఫూర్తిగా నా కథాకృత్యం (థా ని సంధిగా విడదీయద్దు). గమనిక - మీకు ఎక్కువ శ్రమ లేకుండా  ఈ పక్కన బ్రాకెట్లో వ్యాఖ్యమూస పెట్టా. కాపీ చేసి వ్యాఖ్యలో అతికించేయండి.:-)   (బాగుంది) 
బామ్మసూక్ష్మం - 55 మాటల్లో(అక్షరాలా) కథ
 
స్వామీ, నామనవడికి ఉద్యోగం వస్తే నడిచికొండెక్కి గుండు కొట్టించుకొంటాడు. 
                 ***
స్వామీ, నామేనకోడలి తోటికోడలు  రోగం తగ్గితే పదితులాల గొలుసు హుండీలో వేస్తుంది.
                 ***
స్వామీ, --------------  స్వామీ  ------------  
                 ***
ఒరేయ్. కళ్ళుపోతాయిరా. అయినా నీకోసమే కదా మొక్కెట్టా. 
                 ***
ఏదో నాతాపత్రయంకొద్దీ మొక్కెట్టా. మీయిష్టం.  దేఁవుడితో వ్యవహారం.
                  
                "   "   "
                "   "   "
                "   "   "
 
                   ***
ఏమిటో ఈముసలావిడ ???????....?????
                                       ***
ఒరేయ్, నీకడుపుచల్లగా తిరుపతి తీసుకొచ్చావు, పైకెళ్ళే బస్సెప్పుడో చూడు.
నీకొంట్లో బాలేనప్పుడు నడిచి కొండెక్కుతావని మొక్కానే.  దేఁవుడితో వ్యవహారం. 
పిచ్చివాడా. 80ఏళ్ళదానిమీద  కోప్పడేవాడు దేఁవుడా?  టాక్సీపిలు. నన్నెంత సుఖపెడ్తే నీకంత పుణ్యం. 
!!!!! ?????  !!!!!! ??????  !!!!!!! ?????
 
 
మీ బామ్మని దేవుడు మెచ్చాడు.
ReplyDeleteబాగుంది
ReplyDelete:-) (బాగుంది)
ReplyDeleteమీరు చెప్పిట్లే చేసాను :).నిజంగా చాలా బాగుంది.
-నేనుసైతం
నిజం గా చాలా బాగుందండి..దేవుడే మెచ్చాకా మా లాంటి సందర్శకుల కీర్తనలతో ఇంక పనేముంది చెప్పండి.
ReplyDeleteBaagundandi...good one...
ReplyDelete:-)
అహహ...
ReplyDeleteబాగుంది. బామ్మ మాట బంగారు బాట.
ఆచార్యా, భలే విషయం తీసుకొచ్చారు. బామ్మకు గుండుంటే ఒక మొట్టికాయ వెయ్యాలనిపిస్తోంది.
ReplyDeleteనేను రాసినదాన్నే కథాకృత్యం (సంధి) అనాలి.
రెండోసారి చదివితేగానీ అర్థంకాలా. పేరాలూ విరామాలూ కాస్త చూడగానే అర్థమయ్యేలా పెట్టాల్సింది.
చమక్కుమంది కొసమెరుపు. మాటల గడుసరి మీ బామ్మ, పదాల పొదుపరి మీరు. 55 పదాలకు తెలివిగా కుదించారు!
ReplyDeleteమెచ్చిన దేవుడికి, విచ్చేసి మెచ్చిన సందర్శకులకి,తప్పొప్పులనరయగల్గిన పూజారికి, నాపదాల పొదుపరి తనాన్ని అక్షయంగా పొగిడిన చదువరికి, (వ్యాఖ్యలు) రాయని చదువరులకి కృతజ్ఞతలు.
ReplyDelete