Saturday, November 29, 2008

ముంబై ఇక్కట్లు - వహ్ తాజ్ అనండి

తాజ్ హోటల్ ప్రస్తుత పరిస్థితి చూసాక మనసంతా బాధతో నిండిపోయింది. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరి నుండి చూస్తేకనిపించే మేరునగంలా కనిపించే చారిత్రక కట్టడం ఇది. ఒకటి రెండుసార్లు ఎవరినో కలవడానికి లోపలికి వెళ్ళినా, బయటినుంచి ఎంతసేపైనా చూస్తూఉండిపోవాలనిపించే అందమైన అతిపేద్ద భవనం ఇది. దాని సొగసు, హొయలూ ఇప్పుడు గతకాలపు వైభవం. టీవీలో చూస్తోంటే దీన్ని తిరిగి పాత తాజ్ లా చేయాలంటే చాలాకాలం పడుతుంది. డబ్బు నష్టం కంపెనీదైనా, అసలు నష్టం దేశానిదే అని పిస్తుంది దీని వందేళ్ళ పైబడిన చరిత్ర వింటే. ఈహోటల్లో బెర్నార్డ్ షా. బార్బారా కార్టలాండ్ లాంటి హేమాహేమీలు బసచేసారట. తెల్లవాళ్ళ హోటల్లో తనని రానివ్వకపోవడంతో జంషడ్జీ నసెర్వాన్జీ టాటా ఈహోటల్ని కట్టాడట. ఇందులో సరోజినీ నాయుడు 3 దశాబ్దాల పాటు ఓసూట్ తనకోసం ఉంచుకున్నారట. శారదా ద్వివేదీ తను రాసిన అప్రచురిత పుస్తకం తాజ్ ఎట్ అపోలో బందర్ అన్న పుస్తకం లో తాజ్ చరిత్ర పొందుపర్చారట.
వహ్ తాజ్ ....

Friday, November 28, 2008

ముంబై ఇక్కట్లు - నివాళి

ముంబైలో జరిగిన మారణహోమంలో మరణించిన పోలీసులకు నివాళి అర్పించాలంటే ఈ కింది లంకె నొక్కండి.
అమరవీరులకి నా నివాళి
ప్రతి సెకనుకీ నివాళులర్పించిన వాళ్ళ సంఖ్య పెరుగుతోనే ఉంది. ప్రజల సెంటిమెంట్ అర్ధమవుతోంది. రెబీరో అన్నట్లు ఇది ఒక మహత్తరమైన మలుపైతే ఎంత బాగుంటుంది.

Thursday, November 27, 2008

పాపం పోలీసులు

రోజూలాగే తెల్లారినా, రాత్రి ముంబాయిలో 10 చోట్ల జరిగిన తీవ్రవాదుల కాల్పులు, స్వైరవిహారం కని (టీవీలో), విని ఎంతమందికి తెల్లవారలేదో, ఎంతమంది జీవితాలు చీకటిలో కెళ్ళిపోయాయో తలుచుకుంటే మనసంతా ఏదోలా అయిపోయింది. మా అబ్బాయైతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామని గొడవ. మా అమ్మాయికి ఎవరూ ఏమీ చేయలేరా అన్న నిస్పృహ. కాస్త చదవేస్తే హిందూ తీవ్రవాదమా, ఇస్లాం తీవ్రవాదమా అన్న మీమాంసలో పడిఉండేవారు. ఇంకా బాగా చదవేస్తే ఇంకా పనికిమాలిన వాదాల్లో పడి అంత బాధ పడుండేవాళ్ళు కారేమో.

అదలా ఉంచితే, ఇంక అందరూ పోలీసుల వైఫల్యం మీద లెక్చర్లు మొదలెడతారు. టెర్రర్ సంఘటనైనా, దొంగతనమైనా, మతకల్లోలాలైనా, సమస్య ఏదైనా అక్షింతలు పోలీసులకే. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు పాపం పోలీసులే పాపాల భైరవులు. ఒక వర్గంవాళ్ళని పట్టుకుంటే వేరేవాళ్ళని పట్టుకోలేదేమని ప్రశ్నిస్తారు. సరేనని ఎవరినీ పట్టుకోక పోతే ఇంకో తంటా. నేరస్థులని పట్టుకుని మర్యాదగా సారూ మీకు ఈపేలుళ్ళతో సంబంధముందా అని అడిగి, వాళ్ళు అబ్బే లేదంటే, చెవిలో పువ్వెట్టేసుకుని వదిలేయాలి. లేక పోతే మానవ హక్కుల ఉల్లంఘన. అసలు పోలీసులూ, వాళ్ళ కుటుంబ సభ్యులూ మనుషులేనని మనకెవ్వరికీ కనీస స్పృహ ఉండదు. ఈవేళ్టి దాడిలో 11 పైగా పోలీసులు చనిపోయారు. అందులోనూ ముఠాలకే సింహస్వప్నమైన సలాస్కర్ కూడా ఉన్నాడు. ఆమధ్య ప్రదీప్ శర్మ, దయా నాయక్ లాంటి ఎన్ కౌంటరు నిపుణులని సస్పెండు చేసి, వాళ్ళమీద కేసులేసి ప్రాణాలొడ్డి పని చేస్తున్న పోలీసుల ఋణం ఎలాతీర్చుకోవచ్చో మహారాష్ట్ర ప్రభుత్వం చూపించింది.

See the following reaction to criticism of police after bomb blasts of Mumbai a few years ago. The critics are so called intellectuals who wrote articles in Economic and Political Weekly.

"The main claims of all these articles combined are that: (1) the police are biased against Muslims; (2) They did not respect human rights of Muslims in the aftermath of Mumbai bomb blasts; (3) after the blasts they rounded off the Muslim areas and arrested 1500 Muslims. (4) They do not treat Hindus the same way.

The argument that police is not treating the Hindus the same way and are biased against Muslims is a thoroughly demoralizing statement. This is so because, in the same article the authors acknowledged that most of the 1500 Muslims rounded off were released unhurt soon. Also these articles reported that police did not assault educated Muslims taken into custody. The articles further highlighted the positive response of the police commissioner in respect of avoiding arrests in the places of work like school! That is, police is not completely insensitive to the feedback from the public. The working of police as every one of us knows is always the same way with anybody. They are prone to such stereotyping to start with. Let us not miss the point that they work under lot of pressure from government and public especially whenever such major incidents like Mumbai blasts happen. We all expect miracles from them. We are all ready to question them, 'could they not keep an eye on this sect or those sections' and if they target any sect we are again the first people to question why they are targeting them. See what the EPW editorial ( Sept 2, 2006) said, "Security forces virtually laid siege to the Muslim dominated city of Aurangabad where 30 kg of RDX was seized earlier in the year". If police do not go and search in Aurangabad where they seized RDX earlier, will they not be accused of ignoring clues, neglect of duty and shaking hands with terrorists? Daily Press is hungry for such headlines. Do not mistake the above arguments for my justification of the methods of the police. My only submission is that nothing much should be deduced about anti-Muslim bias from this otherwise common approach of the police.

The articles also criticized police for lifting the cap of a Muslim and the immigration people for turning away a person due to damaged passport. These things, any international traveller will see as the most common and normal things happening to anybody and everybody. Due to the liquid bomb threat all the passengers were subject to thorough checking and they are not allowed to carry even toothpaste, water and anything which security people objected to. Caps were lifted as well in front of my own eyes. Imagine the trouble to the passengers. Imagine the cost imposed ultimately on the common man. It is better to understand that police and immigration people examine everyone with the hypothesis that everybody is a potential threat to security and they cannot take chances. Here, in the whole process one should understand the compulsions of the police and others to impress on and reassure the public about their discharging of duty."

గుడ్డిలో మెల్ల – కేంద్ర సహాయమంత్రి చనిపోయిన పోలీసుల కుటుంబాలు తమ భవిష్యత్తు గురించి దిగులు పడనవస్రం లేకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చి నా మనసుని కదిలించాడు. ఎలక్షన్ హామీలా దీన్ని మరచిపోకుండా ఉండాలని ఆదేవుడిని ప్రార్ధిస్తూ....

Sunday, November 09, 2008

ముంబై ముచ్చట్లు : పాత పెన్నుకి కొత్తపాళీ

కొత్తపాళీ గారు కబుర్లు మొదలెట్టాక, నాక్కూడా నా పాళీ మార్చాలని పించింది. చూస్తే ఇంతకుముందు ముంబై ముచ్చట్లు అని శీర్షికతో ఇలా ముంబై కబుర్లు చెప్పాలని అనుకున్నట్లు గుర్తొచ్చింది. అయినా ముంబై ముచ్చట్లేముంటాయి చెప్పడానికి - ఏ నగర చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం - నగరాల చరిత్ర సమస్తం చెత్త, చెదార, కుళ్ళు మయం. 1993 లో ముంబై మొదటిసారిగా వచ్చినప్పుడు, అనుకున్నంత భయంకరంగా లేదు, పర్వాలేదనిపించింది. వర్షాకాలం చూసాకా పబ్లిక్ టాయిలెట్టాఫిండియా అని పించింది. కొన్నాళ్ళున్నాకా, దేశంలో బెస్టు సిటీ అనిపించింది.

ఢిల్లీలో 9 ఏళ్ళున్నాఢిల్లీమీది ఇష్టాన్ని కేవలం కొన్ని రోజలలోనే మరిపించగలిగిందీ నగరం. కారణం ఇక్కడి మనుషులు. వాళ్ళో పధ్ధతి పాడూ ఉన్న వాళ్ళు (ఇప్పుడు కాదు). ఒకాయన ఢిల్లీ, ముంబైలలో ఏది నచ్చిందంటే తడుముకోకుండా ముంబై అని చెప్పా. మామూలుగా ఏదైనా ఎక్కువగా మనదగ్గరుంటే దానికి విలువ ఇవ్వం, కానీ ముంబై జనాలు ఇంత అధిక జనాభా ఉన్నా కూడా సాటిమనుషులకి విలువా, గౌరవం ఇవ్వడం నా అభిప్రాయానికి మూలం అని చెప్పా. ఆయన కూడా నా అభిప్రాయానికి వంతపాడి తను కూడా అదే కారణంగా ముంబైనిష్టపడుతానని చెప్పాడు (మహరాష్ట్రీయుడు కాడు). అందరికీ సమయం తక్కువైనా ఉన్నంతలో పక్కవాడిని పట్టించుకోవడం, అందరికీ హడావుడే కాబట్టి, క్యూ పాటించడం, సహనం, వ్యాపారస్తులు వినియాగదారులకిచ్చే సేవల్లో నాణ్యత ముంబైలో కనిపించేవి. ముంబై జనాలు ఒక్కరే ఉన్నా కూడా క్యూ పాటిస్తారని చమత్కరిస్తోండేవాడిని - వీళ్ళ క్రమశిక్షణకి ముచ్చటేసి. గ్యాంగులు, గూండాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటోంటే మా లాంటి సామాన్య ప్రజలు మా బతుకు మేం బతికేవాళ్ళం.ఇప్పటి పరిస్థితి చూడండి. ఉత్తరభారతీయులంటే పడని పరిస్థితి. సామాన్య ప్రజలు భయంగా బతికే పరిస్థితి. నగరాల్లో జీవనోపాధులు ఎక్కవని ఇక్కడికి అందరూ చేరుకుంటారు. ఇది సహజం. మరాఠీయా, బీహారీయా అని సంకుచిత చర్చ లేవదీసి కుళ్ళు రాజకీయాలు చేయడం వల్ల అందరికీ నష్టమే. ట్రైబల్ ఇన్స్టింక్ట్ అనిపించడంలేదూ. అయినా మన తెలుగు వాళ్ళకన్నా వీళ్ళే బెటరేమో. మనలా సాటి తెలుగువాళ్ళనే తరిమేద్దామనుకోవడంలేదు.

*************

అసహనం అన్నిచోట్లా చోటుచేసుకోవడం సాధారణమైపోయింది. కుటుంబసభ్యుల మధ్యే సయోధ్య మిధ్యైపోయింది. ఒకావిడ గృహహింస చట్టంకింద మొగుడిమీదా, అత్తగారిమీదా కేసు పెట్టింది. విచారించిన జడ్జి గారు ఈచట్టం కింద అత్తగారు రారని వదిలేసారు. అత్తగారు సంతోషపడి, ఈతీర్పు ద్వారా కోడళ్ళ ఆరళ్ళబారినుండి అత్తలకి రక్షణ కలుగుతుందని ఆశాభావం వ్యక్త పరిచింది. ఇది (విన)చదవగానే స్త్రీవాదులు చిందులు తొక్కుతారేమో. కానీ ఆఅత్తగారి మాటల్లో ప్రస్తుత సమాజపోకడ కనిపిస్తుంది. కోడళ్ళ బారిన పడిన అత్తల (కొండొకచో మామలు) సంఖ్య తక్కువుండదనుకుంటా. ఇక్కడ కోడలా, అత్తా అన్న ప్రశ్న కాదు - పరస్పరావగాహన సమస్య. ఆఫీసులో కొత్తగా జేరిన వాళ్ళ పరిస్థితికీ, కొత్తకోడళ్ళకీ పెద్ద తేడా కనిపించదు నాకైతే. ఏసంబంధంలోనైనా ఒక పీడితుడూ(రాలూ), పీడించే(ది)వాడూ ఉండడం చాలా బాధాకరం.
******
జడ్జి అంటే గుర్తొచ్చింది. ఈమధ్య వాయిదా మీద వాయిదాలు వేస్తుంటే విసిగి పోయిన ఒక చిన్నకారు నేరస్థుడు జడ్జిగారిమీదకి చెప్పు విసిరాడు. కోర్టులంటే ఇంతే - కోర్టుకెళ్ళిన వాడు, కాటికెళ్ళినవాడు సమానమని ఊరికే అన్నారా! అదే సినిమాలో అయితే చిరంజీవి చెప్పు విసరడమే కాకుండా ఓపెద్ద ఉపన్యాసమిస్తాడు. మనమందరం తప్పెట్లు కొట్టి ఈలలేసేస్తాం. ఇక్కడి అర్భకుడి మీద మాత్రం ఉన్న కేసుకి ఇంకో కేసు జోడయింది పాపం.
పునర్మిలామః

Wednesday, November 05, 2008

ఒబామా.. గెలిచిన వాడే మొనగాడు.

You may have winning ideas. But you need much more to win the game.
ఒబామా గెలిచిన సందర్భంలో వెల్ష్ (Jack and Suzy Welch) తను రాసిన Barack Obama's Victory: Three Lessons for Business - అన్న వ్యాసంలో ఒబామా గెలుపు, మెకెయిన్ ఓటముల నుండి వ్యాపారస్తులు నేర్వగల 3 సూత్రాలు వెలికి తీసారు..
అవి –
స్పష్టమైన, నిశ్చితమైన దార్శనికత.
కార్య నిర్వహణ – అనుకున్నవి ఆచరణలో పెట్టడం.
మనకి అనుకూలురైన, మంచి స్థాయిలలో ఉన్న స్నేహితులు

ఏది ఏమైనా గెల్చినవాడే మొనగాడు.
ఒబామా ఏదో చేసేస్తాడు, ప్రపంచాన్ని మార్చేస్తాడని ఆశించక్కరలేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోయే స్థితి దాటిపోతే సుఖం.