Friday, January 26, 2007

తెలుగు బ్లాగుకొక లోగో

లోగో అన్నది అది ప్రాతినిధ్యం వహించే సంస్థకో, ఉద్యమానికో 'మొహం' లాంటిది. face is the index of mind కదా. అందుకే లోగో చూడగానే ఆ సంస్థ ఏమిటో తెలిసేలా ఉంటే అది గొప్ప లోగో అని చెప్పొచ్చు. కొన్ని సంస్థల పేర్లు logo-friendly' గా ఉంటాయి. కొన్ని లోగోలు వాటిని తయారుచేసిన కళాకారుల సృజనాత్మక శక్తిని ప్రతిబింబిస్తాయి. నాకు బాగా నచ్చిన లోగో ఈ టీవీది. దాంట్లో తెలుగు ఈ ఉంటుంది, ఆంగ్ల E TV కూడా ఉంటుంది. ఈనాడు electronic version లోగోలో ఈ తో పాటు e కూడా ఉంటుంది.






రఘురామ్ ఆ మధ్య తెలుగు బ్లాగర్ సంఘానికి ఒక లోగో ఉంటే బాగుంటుందని సూచించారు. చాలా మంది ఆమోదించారు. ఈ ప్రయత్నానికి తొలి అడుగుగా ఇక్కడ కొన్ని లోగోలు ప్రతిపాదిస్తున్నాను. వీటిని MSPaint లో తయారుచేసాము. వేరే ప్రతిపాదనలు కూడా సేకరించి అన్నింటినీ ఓటింగు పెట్టి జనామోదమైన లోగోని అంగీకరిస్తే బాగుంటుందేమో. బ్లాగర్ సంఘం పెద్దలకి ఈమేరకి నా విన్నపం. ఇక్కడ ఇచ్చిన లోగోల్లో మూల సూత్రం: సాలెగూడు internet కీ, తెలుగు అ, ఆంగ్ల e కలిసొచ్చేలా లోపల అక్షరం internet లో తెలుగుకీ, electronic media కి చిహ్నంగాను ఉపయోగించడం. మూడు లోగోలు ఒకటే, రంగులు వేరే. ముందు ముందు ఇంకా ఏమైనా ఐడియాలొస్తే update చేస్తా.














3 comments:

  1. ఈ ఆలోచన బాగుంది. మనమిక తెలుగు బ్లాగర్ సంఘం కంటే విస్తృతమైన ఈ-తెలుగు సంఘం లో భాగం.

    ReplyDelete
  2. లోగో బాగున్నది.

    దీనిని పరిశీలించవచ్చు.

    ReplyDelete
  3. లోగో బాగుంది.ఈనాడు లోగో లో e ఉందని నేను కూడా ఇన్నాళ్లు గమనించలేదు.మీ నిశిత దృష్టికి అభినందనలు.కాకపోతే మన లోగో గురించి నాకున్న అభిప్రాయాలు ఏంటంటే తెలుగు అనే పదం చుట్టూ ఓ ముగ్గులా ఈ అంతర్జాలాన్ని/జగద్వలయాన్ని సూచిస్తూ బొమ్మ గీస్తే ఎలా ఉంటుందంటారు. అదీ ఒక్కసారి మీ చిత్రలేఖన కళతో ప్రయత్నించండి.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.