Thursday, March 08, 2007

తిండీ తిప్పలు -1: ప్రతిస్పందన


రాధిక, సుధాకర్(శోధన), నాగరాజు పప్పు, సిబీరావు, వల్లూరి, నాగరాజా, 'తెలుగోడు' గార్లు నా తిండీ తిప్పల మీద (బ్లాగు టపా మీద అని భావం) వ్యాఖ్యలు వ్రాసారు. మీ అందరి సుస్పందనకి కృతజ్ఞతలు. అక్కడే నా ప్రతిస్పందన ఇరికించి వ్రాయడం ఎందుకో ఇష్టంలేక పోయింది. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను.
చైనా, కొరియా లాంటి వాళ్ళ వంటల్లో వెనిగర్ బాగా వాడతారు. నువ్వుల నూనె అయితే సరేసరి. అందులోనూ ముడి నువ్వుల నూనె బాగా వాసన వస్తుంది. వీళ్ళకి నూపప్పు అంటే మనకి జీడి పప్పులా అన్న మాట. అపురూపం, మహా ప్రియం (ఖరీదు). వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల మీది ఆంక్షలు తొలగించక ముందు వీళ్లు చైనా నుండి నూపప్పుని దొంగ రవాణా చేసుకొనేవారట. వీళ్ళ అన్ని వంటకాల మీదా కొద్దిగా నూపప్పు జల్లడం సర్వసాధారణం.

నేను బరహా యూనికోడ్ వాడుతున్నాను. నా క్కూడా మం(గుం)టనక్క లో సమస్య వస్తోంది. ఎవరైనా 'స్వే' (SWE) లు సలహా చెప్పండి దయచేసి. ఇప్పుడు తెలుగు పెళ్ళి మార్కెట్లో SWE అనే గుజ్జునామం
software engineer కి చాలా సామాన్యంగా వాడుతున్నారు. ఈ అర్ధసంవత్సర సెలవల్లో నా మేనకోడలి కోసం సంబంధాలు వెతకడంలో నాకు పెళ్ళిసంతల పడికట్టు పదాలు, విఫణి (మార్కెట్) తీరుతెన్నులు, ధరవరలు బాగానే పట్టుబడ్డాయి. రోగి బతక్కపోయినా వైద్యుడికి అనుభవం వచ్చినట్లైంది.
రాధికగారూ. రాగిముద్ద మీద చిన్న నక్షత్రం గుర్తు చూసారా. నిబంధనలు వర్తిస్తాయి. హా హా హా...
అన్యోని ఘేసియో (గూడ్ బై)

1 comment:

  1. తిండి విశేషాలు చెప్పారు. ఎన్నొ ప్రత్యేకతలు కలిగిన Jeju Island, South Korea విశేషాలు సచిత్రంగా వివరిస్తే మా కనులకు కూడా విందు చేసిన వాళ్ళవుతారు.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.